‘విశ్వజనని’గా అమ్మ, ‘అమ్మ ప్రేమ తత్వం’ అనే అంశాలపై జిల్లెళ్ళమూడి మాతృశ్రీ పాచ్య కళాశాలలో వక్తృత్వపు పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. ఈనెల (అక్టోబరు 27వ తేదీన జరిగిన ఈ పోటీల కార్యక్రమంలో ‘Mother of All” త్రైమాసిక ఆంగ్ల పత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ డి.వి.యన్. కామరాజుగారు, కళాశాల పూర్వపు కరస్పాండెంట్ శ్రీ ఎమ్. శరచ్చంద్రగారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణ గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించారు. శ్రీ ఎన్. లక్ష్మణరావుగారు విద్యార్థుల ప్రసంగాలను చక్కటి విశ్లేషణ చేసి సూచనలు అందించారు. విశ్వజననీమైన అమ్మ ప్రేమ యావత్ ప్రపంచానికి మార్గదర్శకమని న్యాయనిర్ణేతలు వివరించారు. కులమత వర్గ జాతి ప్రాంతీయ భేదాలు లేని అజరామరమైన అపూర్వమైన ప్రేమ తత్త్వాన్ని ‘అమ్మ’ ఈ లోకానికి ఒక గొప్పవరంగా ప్రసాదించినట్లు పేర్కొన్నారు. అమ్మ ప్రేమ విశ్వవ్యాప్తమైతే, ఈ ప్రపంచమే ఒక ఇల్లు అవుతుందనీ, ప్రపంచ మానవాళి ఏక కుటుంబీకులవుతారని వారు స్పష్టం చేశారు. సుమారు నలభై మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని అమ్మ ప్రేమతత్త్వాన్ని విశ్లేషించి, ‘విశ్వజనని’గా అమ్మను అభివర్ణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలలో డిగ్రీస్థాయిలో 1) డి. ఉషారాణి III B.A. (Tel), కె. శ్వేత II B.A. (TEL) ప్రధమ బహుమతి పొందగా, ద్వితీయ తృతీయ స్థానాల్లో జి. వెంకటాచారి II B.A. (TEL), ఎన్. జాహ్నవి | B.A. (Skt) నిలిచారు. అలాగే, PDC స్థాయిలో ప్రధములుగా యు. త్రిపురాంజనేయులు, ఎ.మనీషాలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సి. హెచ్. చంద్రశేఖర్, ఎ. లక్ష్మీ గెలుపొందారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఎమ్.సత్యనారాయణ గారు ఆద్యంతం ఉత్సాహంగా నిర్వహించారు.
మాతృశ్రీ ప్రాచ్య కళాశాల, జిల్లెళ్ళమూడిలో వక్తృత్వపు పోటీలు
Phani Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : November
Issue Number : 4
Year : 2014
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.