శ్రీ జయంతి చక్రవర్తి విశ్వకుటుంబ సభ్య సమ్మేళనంలో ప్రస్తావించినట్లు అమ్మ మనకు అందించిన మంత్రాలను పురశ్చరణ చేసుకునేందుకు వీలుగా శ్రీ అనసూయా మహాదేవి మూలమంత్ర హోమవిధానం అన్న గ్రంథం వెలువడింది. గ్రంధం సవివరంగా ఉన్నది. అమ్మ మన అందరకు అంఅ అని అంతా అని, ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అని “జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అని ఉపదేశించినట్లే లెక్క ఎన్నోసార్లు తన సమక్షంలోనే మనచేత అనిపించింది కదా. పురశ్చరణ ఈ మూడు మంత్రాలూ చేయవచ్చు. గ్రంథంలో ప్రచురించిన రీతిగా మాతృగాయత్రిగా నామ మంత్రం చేసుకోవచ్చు. అందులో ప్రకటించిన ఇతర మంత్రాలనూ స్వీకరించవచ్చు.
పురశ్చరణ ప్రక్రియ కాలక్షేపంగా ఉండకూడదు. మంత్రాన్ని రెండు గంటలో అంతకంటే ఎక్కువ సమయమో జపిస్తేనే జపం బలంగా సాగేది. దీక్షాకాలం పరిమితంగానే ఉండాలి. అంటే 11, 21 మండలము రోజులలో లక్ష జపం పూర్తి చేయాలి. ధాన్యాభిషేకం నాడు దీక్షాస్వీకారం చేసి అమ్మ జన్మదినానికి గాని ఆ మరునాడు గాని హోమం చేసుకోవచ్చు. అలాగే అమ్మ జన్మదినం నాడు దీక్ష తీసు మే 5ననో, ఆ మరునాడో హోమం చేసుకోవచ్చు. అదే విధంగా మే 5న మొదలు పెట్టే అనంతోత్సవం నాడు హోమం చేయవచ్చు. అనంతోత్సవం నాడు దీక్షాస్వీకారం చేస్తే అన్నపూర్ణాలయ వార్షికోత్సవం నాడు ఆగష్టు 15న హోమం చేసుకోవచ్చు. ఆగష్టు 15 చేపట్టే దీక్ష నవరాత్రులలో ముగించవచ్చు. నవరాత్రులలో మొదలు పెట్టి డిసెంబరులో పూర్తిచేయవచ్చు. ప్రతిపండుగకు జిల్లెళ్ళమూడి రావచ్చు. అమ్మ మంత్ర హోమం చేసుకోవచ్చు. సిద్ధంగా యాగశాల ఉన్నది. ఋత్విక్సహాయం లేకుండానే హోమం చేసుకునే ప్రక్రియ చెప్పబడింది. ఒకేసమయంలో రెండు మంత్రాలు పురశ్చరణకు తీసుకొనవచ్చు. అంఆ, ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం రెండూ కాని, అమ్మనామం అంఆ రెండూ కాని, ఓంఐం క్లీం హ్రీం శ్రీంఓం, అమ్మ నామం రెండూ కాని చేపట్టవచ్చు.
అమ్మ మనకు అందించిన ఈ మూడు మంత్రాలను సిద్ధమంత్రాలుగా చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు ఏ రకమైన అవసరం వచ్చినా అప్పుడు మూడు మంత్రాలలో ఏదైనా ఒకటి ఎంచుకుని అవసర ప్రబలతను పట్టి సంఖ్యానిర్ధారణ చేసుకుని ఆ సంఖ్యకు జపహోమాదులు చేసి అవసరం తీర్చుకోవచ్చు. దేనికైనా పట్టుదల ముఖ్యం. వయసులో చిన్నవాళ్ళు, తీరిక ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, సోదరీసోదరులెవరైనా పెద్దసంఖ్యలో ముందుకు వచ్చి ప్రతిపండుగకు అమ్మ మంత్రపురశ్చరణలు చేసి హోమాలు జరుపుకునేందుకు కృతనిశ్చయులు కావలసిందిగా కోరుతున్నాం. క్షీరతర్పణం చేసుకునేందుకు వీలుగా మనకు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వెండి ప్రతిమలున్నాయి. శ్రీ అనసూయా మహాదేవి బీజాక్షర యంత్రం రాబోతున్నది. ఆసనాలు, పట్టుబట్టలు అన్నీ మీకు అందుబాటులో ఉంచబడుతాయి. వాని మూల్యం చెల్లించి నిరాటంకంగా దీక్షలు కొనసాగించుకొనవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఫిబ్రవరి 17న మాతృగాయత్రి అంటే “ఓం జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి, శ్రీ పరాత్పరి స్వాహా” మంత్రదీక్ష యర్రచందనమాలతో సహా ఇవ్వబడుతుంది. ఆ దీక్షా స్వీకారం చేసి లక్షసంఖ్య జపం పూర్తి చేసినవారికి ఆ అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా హోమం చేసుకొనే ఏర్పాటు చేయబడుతుంది. సోదరీసోదరులు ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ముందుగా జపం పూర్తి చేసి శ్రీ విశ్వజననీ పరిషత్కు తెలియచేసిన వారికి తగు ఏర్పాటు చేయబడతాయి. అధికసంఖ్యలో పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
– శ్రీ విశ్వజననీపరిషత్
Pageno;15,16,17,18
విశ్వజనని
19
ఫిబ్రవరి 2010
పద్మావతి, శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగింది. అమ్మకు గం. 10-35 ని. మహాహారతిచ్చారు.
13.01.10 : గత 30 రోజులుగా ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అనసూయేశ్వ రాలయంలో అమ్మ అభిషేకమునకు వూరి చెరువు నుండి సర్వశ్రీ వి. రమేష్, మతుకుమల్లిరాము, వఝ మల్లు తీసుకురాగా ఆలయంలో అమ్మకు స్నాన అలంకారాలు శ్రీమతి బ్రహ్మాండం శేషు, డి. పద్మావతి, పి. లక్ష్మిగారు, వి. హైమ, రమ పూర్తి చేసి 5 గంటలకు హారతి ఇచ్చి పాల్గొన్నారు. గుడితలుపులు తెరుస్తున్నారు. శ్రీమతి పి. పద్మావతిగారు, శ్రీయుతులు పి. సుబ్రహ్మణ్యం గారు అమ్మ నామం, భజన కార్యక్రమం నిర్వహించారు. శ్రీయుతులు ఐ. హనుమబాబు గారు తిరుప్పావై చదివి అర్థం అందరికీ వివరించారు. ఈ నెలరోజులు అన్నపూర్ణాలయం నుండి శ్రీయుతులు చలపతి శ్రీమతి రమ, శ్రీవెంకట రమణలు, వివిధ రకాలైన ప్రసాదాలు నివేదన అందించారు. భోగి పండుగ సందర్భంగా ధనుర్మాసంలో అమ్మసేవలో పాల్గొన్నవారికి శ్రీ వై.వి. మధుసూదనరావుగారు అమ్మ ప్రసాదంగా నూతన వస్త్రాలు బహుకరించారు.
13.01.10 : భోగి సందర్భంగా అనసూయేశ్వరా లయంలో పూజ భజన జరిగినవి. ఉదయం 9 గంటలకు అమ్మ కల్యాణ వేదిక వద్ద విజయపాడిన అమ్మ పాటల సి.డి. ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ సి.డి. సంగీతం శ్రీ ఎమ్. పూర్ణచంద్రరావు, సమర్పణ శ్రీ ఎమ్. యస్. ఆర్. ఆంజనేయులు.
మధ్యాహ్నం కాకుమాను, జిల్లెళ్ళమూడి గ్రామముల నుండి షుమారు 20 మంది ఏడాదిలోపు పసిపిల్లల తల్లులు పాల్గొనగా డోలోత్సవం జరిగింది. శ్రీమతి విజయ, రావూరి ప్రసాదు జోలపాటలు పాడారు. తల్లులకు ఊయలగా కట్టిన క్రొత్త చీర, రవిక, పసివారికి పాలసీసా, టవల్స్, డ్రెస్స్ మొదలగు వస్తువులు బహుమతులుగా ఇచ్చారు. శ్రీ తంగిరాల కేశవశర్మ, శ్రీ పి.యస్. ఆర్. వహించారు. ఈ కార్యక్రమ బాధ్యత
సాయంత్రం 4 గంటలకు అనసూయేశ్వరాలయంలో అమ్మ పూజ భజన అనంతరం వూరిలోని వారు, ఆవరణలోని వారు, ఇతర ప్రదేశముల నుండి వచ్చినవారు, అమ్మకు పాల్గొన్నారు. భోగిపండ్లు పోసుకున్నారు. పూజారులు అందరి పై ఆశీర్వచన పూర్వకంగా భోగిపండ్లు పూలు పోశారు. సాయంత్రం శ్రీ వి. ధర్మసూరి, శ్రీమతి భగవతి ప్రతి నెల
ఆలయంలో ఏకాహంచేసే గ్రామసోదరీ మణులకు అమ్మ ప్రసాదంగా 69 చీరలు పంచుట జరిగింది.
14.01.10 : శ్రీయుతులు వారణాసి ధర్మసూరి, శ్రీమతి భగవతి యజమానులుగా 81 వేలు ఖడ్గమాల హోమము జరిగింది. హోమములో పాల్గొనుటకు శ్రీశైలం శ్రీపూర్ణానంద స్వామివారి శిష్యులు శ్రీ బి.ఆర్.కె. గారి ఆధ్వర్యంలో 60 మంది వచ్చి పాల్గొన్నారు. ఆవరణలోని వారేకాక శ్రీ ఆర్. లక్ష్మీనారాయణ, శ్రీమతి కమల
17.01.10 : శ్రీ ఉప్పులూరి వాసుదేవరావు గారి రెండవ కుమారుడు శ్రీ యు.వి.ఆర్.గిరీశ్ కుమార్తె చి.ల.సౌ. రమ్య వివాహం తిరుపతి వాస్తవ్యులు కర్రి సూర్యనారాయణ గారి ప్రధమ కుమారుడు వంశీకృష్ణతో నిశ్చయమైన సందర్భంగా ఇరుకుటుంబాలు అనసూయేశ్వరాలయంలో నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు.
శ్రీ అబ్బరాజు మధుసూదన ప్రసాదు, శ్రీమతి కమలమ్మ హైదరాబాదు నుండి వచ్చి హైమవతీదేవి ఆలయంలో హైమవతీ వ్రతం జరుపుకున్నారు. వ్రతంలో పాల్గొనుటకు రంగన్నగూడెం నుండి సామా నారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు శ్రీ వంగల ప్రతాపరెడ్డి వారి కుటుంబసభ్యులు వచ్చారు. అందరికీ అమ్మప్రసాదం అందించారు.
20.01.10 : శ్రీ పంచమి సందర్భంగా నిత్యహోమములతో పాటు మేధోసూక్తం 11 ఆవృతులు హోమం చేసారు. బ్రహ్మాండం శేషు, డి. పద్మావతి హైదరాబాద్ నుండి వచ్చిన ఎమ్. భానుమతి, ఎస్.మోహన కృష్ణ దంపతులు, బి.జి.కె. శాస్త్రి దంపతులు, చిరంజీవులు వైష్ణవి, జయ పాల్గొన్నారు. అన్నపూర్ణాలయంలో శ్వేత పదార్థాలతో అందరికీ విందు ఏర్పాటు చేసారు.
22.01.10 : రధసప్తమి సందర్భంగా ఆవు పిడకలతో చేసి పాలు పొంగించి అనసూయేశ్వరాలయంలో పొంగలి, నైవేద్యం గావించారు. ఈనాడు విశేషంగా జరిగిన సౌరహోమంలో దాదాపు 30 మంది వరకూ హైదరాబాద్, నెల్లూరు, విజయవాడల నుండి వచ్చి హోమములో
23.01.10 : రాజమండ్రి వాస్తవ్యులు బోళ్ల వరలక్ష్మి, వారి పుత్రిక సరోజిని, చక్కా లక్ష్మి అనసూయేశ్వరాలయంలో అనసూయా వ్రతం చేసుకున్నారు.