జాతి, కుల, మత రహితంగా అందరికీ ఉచిత వైద్యసేవలు అందించే మహోన్నత లక్ష్యంతో 1978లో జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ అమృత హస్తాలమీదుగా మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఆవిర్భవించింది.
4.12.11 తేదీన సాయంకాలం గం. 3-00 ల నుండి గం.6-00 ల వరకు ప్రాథమిక పాఠశాల, పాండురంగాపురంలో ఉచితవైద్యశిబిరం నిర్వహించ బడింది.
జగన్మాత ‘అమ్మ’ పూజ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ ఎ.ఇనజకుమారి M.B.B.S. A.C.C.P., శ్రీ హైమ నర్సింగ్ హోం, బాపట్ల, డాక్టర్ సి. రామమోహనరావు M.D., మెడకిల్ ఆఫీసర్, మాతృశ్రీ మెడికల్ సెంటర్, జిల్లెళ్ళమూడి సంయుక్తంగా తన గౌరవ సేవల్ని అందించారు. ఆయా వైద్యశాలల సిబ్బంది శ్రీ మతుకుమల్లి రాము, శ్రీమతి ఝాన్సీ, శ్రీ బాలాజీ, రమ్య మెడికల్స్, బాపట్ల; శ్రీ రాకేష్, ప్రయోగశాల నిపుణులు, మాతృశ్రీ పాఠశాల, కళాశాల విద్యార్థినులు చి. కల్పన, కృష్ణవేణి, గాయత్రి మరియు శ్రీ విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ జె. యానాదిగారు స్వచ్ఛందంగా తమ సేవలను అందించారు.
ఈ శిబిరం ద్వారా స్త్రీలు, పురుషులు, బాలబాలికలు మొత్తం 75 మంది లబ్ది పొందారు. గర్భకోశవ్యాధులు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత, మొండి గాయాలు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు మొదలగు రుగ్మతలకి చికిత్స జరిగింది. రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. లబ్దిదారుల్లో ముఖ్యంగా వృద్ధులు సంతృప్తిని పొందారు. 4 వేల రూపాయిలు ఖర్చయినది.
తదుపరి శిబిర వివరాలు : (తాత్కాలిక అంచనా)
తేది ది. 8-1-2012; సమయం : గం. 3-00 ల నుండి గం. 6-00 ల వరకు;
స్థలం : బాపట్లకు 12 కి.మీ. దూరంలో ఉన్న బెస్తవారికాలనీ, పాతపాలెం (రామచంద్ర పురం); పాండురంగాపురం దగ్గర
నిర్వహణ ఖర్చు (అంచనా) : రూ. 5,000/
ఈ పవిత్ర ధార్మిక కార్యక్రమంలో ఉదారులైన సోదరీ సోదరులు తమవంతు సహాయాన్ని అందించవచ్చు. మానవరూపంలో ఉన్న జగజ్జననిని అర్చించుకోవచ్చు.
ఇలా ఒక్కొక్క శిబిరానికి రూ. 5,000/ ఇచ్చేవారుంటే నెలకు కనీసం రెండుసార్లు వారి పేర ఉచిత వైద్యసేవలు గ్రామప్రజలకు అందించే అవకాశం ఉంటుంది.
ప్రతినెల ఉచిత వైద్యశిబిర నిర్వహణ
ప్రతినెల మాతృశ్రీ మెడికల్ సెంటర్ నిర్వహించే ఉచితవైద్యశిబిరం ఖర్చు: రూ.5,000/-లు. 2012 జనవరి నెల నుండి నిర్వహించనున్న శిబిరాల నిర్వహణ ఖర్చు నిమిత్తం నేటికి అందిన విరాళాలు వివరాలు.
- శ్రీ బి. వెంకట్రామశాస్త్రి – హైదరాబాద్, రూ.10,000, 2. శ్రీ గిరిషక్కుమార్, కె.వి.వి., ముంబై రూ.5,000, 3. శ్రీ ప్రేమచైతన్య బ్రహ్మాండం, య. యస్., రూ. 5,000, 4. శ్రీ శరశ్చంద్ర బ్రహ్మాండం, యు.యస్, రూ. 5,000, 5. శ్రీమతి అనసూయ విశ్వేష్ (పింకి) యు.యస్. రూ. 5,000, 6. శ్రీ శరశ్చంద్రకుమార్ ఎమ్.యస్, జిల్లెళ్ళమూడి, రూ. 5,000, 7. తమ అత్తగారి పొత్తూరి వరలక్ష్మిగారి పేర శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, గుంటూరు, రూ.5,000, 8. శ్రీమతి ఉషాకిరణ్ కవిరాయని, హైదరాబాద్, రూ.12,340 విలువగల మందులు అందజేశారు. (రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షల నిర్వహణ నిమిత్తం).
వీరందరిపైనా అనుగ్రహ స్వరూపిణి అమ్మ దివ్య ఆశీస్సులు అనవరతం వర్షించుకాక.
- శ్రీవిశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి.