1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మా అనుబంధాలు

మా అనుబంధాలు

R Anantha Krishna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : October
Issue Number : 3
Year : 2014

నా పేరు అనంత కృష్ణ –

చదువుపట్ల నా కెంతో తృష్ణ

కృష్ణమ్మ పరవళ్ళల సంగమ తీరం నా జన్మస్థానం.

జిల్లెళ్ళమూడికి నా విద్యాప్రస్థానం

నా మనసు సంస్కృత విద్యనే కోరింది.
తిక్కన సీమకు వచ్చి చేరింది

వచ్చి చేరాను ఈ బడిలో అమ్మ ఒడిలో

పచ్చని చెట్ల పలకరింపులు

చల్లని గాలులు పులకరింపులు

సంస్కృత, ఆంధ్రసాహిత్యాల పరిమళింపులు

కల్లకపటం ఎరుగని పిల్లలు

అమ్మ పూదోట మల్లెలు

కళాశాల ప్రాంగణం అంటే మాకు ప్రాణం

సోదరసోదరీ ప్రేమ, ఆప్యాయతల తార్కాణం

ఇది కళాశాల వైభవం

ఇక వినండీ నా అనుభవాల ప్రతిభాపాటవం

హిస్టరీ మాస్టారు గారి షోకులు

ఇంగ్లీషు మాస్టారు గారి జోకులు

నిత్యం నీళ్ళ కోసం పడిన బాధలు

అమ్మను గూర్చి విన్న గాథలు

వినాయకచవితికి కోసిన కొబ్బరిబోండాలు

వార్డెన్ గారికి పెట్టిన దండాలు

క్లాసులో ఒకరిపై ఒకరం కట్టిన పేరడీలు

మేం వేసే పిల్లి మొగ్గల గారడీలు

బావ, బావమరిది అని పిలుచుకొనే బంధాలు

లైబ్రరీలో చదివిన గ్రంథాలు

జిల్లెళ్ళమూడి అందచందాలు

కాలేజితో ఏర్పడిన అనుబంధాలు

మరచిపోలేనివి మా అనుభవాలు

జ్ఞాపకాల కోవాలు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!