1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మా జిల్లెళ్ళమూడి అమ్మయే

మా జిల్లెళ్ళమూడి అమ్మయే

Malasani Venkateswara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

పూర్వ పుణ్యాన దక్కె మనకు – విధి వశంబున విశ్వమాత

జయహోూ మాత శ్రీఅనసూయ – రాజరాజేశ్వరీ శ్రీపరాత్పరి!!

 

యోగినిగ శుభ జన్మ నొంది- నీటిపై నావ వలె తేలుతూ

యోగ్యమగు సంసారం పొందె-మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

అమ్మ యని పిలువ ఆర్తితో – ఆదరంబున కరుణించు

లేదు కులమత భేదము-మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

సాదరంబుగ ఆహ్వానించి సంస్కరించును సద్భక్తుల

అన్న ప్రసాద వితరణతో – మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

అందరింట భుజించిన – వర్ణ సంకరమన్న పండితులు

సృష్టిలో లేదు మీ దృష్టిలోపం మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

నా రాశి బియ్యపురాశి యని అన్న ప్రాధాన్యత నొక్కి చెప్పే

– అమృతవాక్కు ఆ తల్లిది మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

నిత్యాన్నదానము ఆశ్రమాన- ఎవరి అన్నం వారే తిన్నారు.

నాదేముంది నాయనలారా – మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

అశ్రమంబున లక్ష జనులు – నొక్కచోట భోజనము చేయ

పొందెను మహదానందము మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

కొందరిది మాత్రమే కాదు అందరిని చాటే –

తారతమ్యములు త్యజించిన-మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

మాతృత్వమే నా ధర్మము – మంచి చెడులెంచక సాకుటే

తల్లి పని యన్న మాతృమూర్తి -మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

చేరువయ్యే అంత్యదశకు మందపాడు వాడు పేదబాలిక –

పునర్జన్మ నిచ్చె కరస్పర్శతో – మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

అమ్మ సాన్నిధ్య తరగతి అపార ఆధ్యాత్మ పురోగతి

నిజ సాధకుల ఉచ్ఛగతి-మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

ఆర్ష విద్య వ్యాప్తి కొరకు విద్యా సంస్థల స్థాపించె

వేగిరమౌ గురు ప్రణాళిక – మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

దేశ విదేశీయు లెందరో – జ్ఞానోదయ ధారలు దిగగ

గాంచిరి ధన్యత నిచట- మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

యోగ్యులగు వారికి నిచ్చు – యోగ దీక్షల నుపదేశము

సాధన సత్ఫలంబు నొంద మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

పొందిరి అమ్మ అనుగ్రహం అందిరి సద్గురు స్థాయిని

భరద్వాజ మాస్టారు గారు -మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

శిష్యులనే వారు లేరు నాకు అందరూ నా శిశువులే గనుక

భక్తులు లేరు అందరూ బిడ్డలే-మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

 

విశ్వ కుండలినీ శక్తిని – సంపూర్ణ విశ్వానికి పంచగల

విశ్వానికే జనని యైన మా జిల్లెళ్ళమూడి అమ్మయే!!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!