ఉదయించిరి మునిమనుమలు
ముదమున ఆశీర్వదించు ముచ్చట తీరన్
పదపదమున అర్కపురీ
సదనము మదిలోన మెదలి సాగెడి రీతిన్
ఏ దేశమునందున్నను
ఆ దేశము మాతృమూర్తి ఆలయమనుచున్
మీదౌ హృదయములోనన్
ప్రోదై ప్రేమామృతమ్ము పొంగునుగాతన్
ప్రేమచైతన్యయు ప్రియమైన పావని
పడసిన “అఖిల శ్రీవత్స” యొకడు
రమ్యశరశ్చంద్ర రాజేశ్వరుల ప్రేమ
సత్ఫల “నాగశశాంక” యొకడు
అనసూయ విశ్వేషు లలరగా పొడమిన
“పూజ” “రాహులు”లన పొదలువారు
అమ్మ ప్రేమాంకురాలనలెత్తినారని
మురియగా నిల్చిన మునిమనుమలు
మనుమలును మన్మరాలితో మనసుదీర
రవియు “వైదేహి” ముచ్చటలాడుచుండ
అందరింటికి వారసులగుచు నిలిచి
భావి సేవకు బంగారు బాటలగుత,