1. Home
  2. Articles
  3. Mother of All
  4. యాజులుగారి సంకటం

యాజులుగారి సంకటం

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : January
Issue Number : 1
Year : 2016

(గత సంచిక తరువాత…)

యాజు :- ఎటువంటి సమస్యలు పెడతావమ్మా?

అమ్మ :- ప్రపంచంలో ఎలాంటి సమస్యలున్నయ్యో మనకేం తెలుసు? సమస్యే ప్రపంచం. ఇందులో ధర్మమేదో? సత్యమేదో? వారి (భర్త) మాట వినటం ధర్మం. ఉన్నది ఉన్నట్లు చెప్పటం సత్యం. మీరన్న ప్రకారం రెండూ ఒకదానికొకటి సంబంధం లేదుగా నాయనా. రెండూ ఒకటేనన్నారు గదూ! నాకు తెలియక అడుగుతున్నాను. వేరే అనుకోబోకండి. సత్యం చర, ధర్మం వద అని లేక ధర్మం చర సత్యం వద కావచ్చు. ఏదైనా అది చరే, ఇది వదే.

యాజు :- ఏమీ చెప్పలేనమ్మా ఆలోచించి తర్వాత మాట్లాడతాను. అమ్మా! పతివ్రతా ధర్మాన్ని గురించీ నీవడిగావే నీ అభిప్రాయం ఏమిటి?

 అమ్మ : :- ఒకటి నన్ను చెప్పమంటారా? నేనట్లా నడవడం లేదు. కాని చెప్తా. ఆయన ఏకపత్నీవ్రతుడైతేనే ఆమె మహాపతివ్రత అవుతుందేమో. మరొక రకంగా కాకపోయినా కావచ్చు. నేననుకుంటే భర్త అనే స్థానం ఎటువంటిదో తెలుసా? సాక్షాత్తుగా సృష్టికర్తేననీ, ప్రతి స్త్రీకి ఇలాంటి భావమే ఉంటుందనీ నా నమ్మకం.

యాజు :- ఔనమ్మా – ఏదో చిన్న చిన్న విధానాలున్నయ్యనుకో! 

అమ్మ :- ఏమిటో ఆ విధానాలు చెప్పండి.

యాజు :- నీవు నిద్ర లేచి భర్త సేవ చెయ్యాలనీ, పడుకోబోతూ పాదపూజ చేయాలనీ చాలా కాలం పడుతుంది, చెప్పవలసినవి చాలా ఉన్నాయ్ ఇట్లాంటివి. ఏ పూజా పనికిరాదు భర్త పూజ తప్ప.

అమ్మ :- ఊళ్ళో లేని భర్తలు కావచ్చు. అప్పుడో? రెండోది, పెళ్ళి చేయంగానే భర్తపోతాడు. వాడినేం చేయాలిట వాళ్ళేం వ్రతాలు? వాళ్ళకేమి లేదా ఆధారం? ఏదో అవరోధం చేత పెండ్లికాని పిల్లలున్నారు వాళ్ళేం వ్రతాలు? వాళ్ళకేమిటి ఆరాధ్యదైవం?

యాజు :- బుర్రకు ఎక్కటం లేదమ్మా ఇంటిలోని భర్తల సంగతేమిటని అక్కడే చంపేశావు.

అమ్మ :- చంపటమేమున్నది? పెద్దల ముఖతః వస్తే ఆచరించలేకపోయినా విందామని.

యాజు :- అయినా నీకు తెలియనిదేముంది తల్లీ?

 అమ్మ :- నా సందేశాలన్నీ నిలిచిపోతాయి ఈ పొగడ్తతో అనేక బాధలు పడిన ఒకామె ప్రవేశించి –

ఆమె :- యాజులుగారూ! నమస్కారం ఎవరో మీ యింటికి తెలిసిన వారొచ్చారంటే అదే ఒక భక్తురాలు.

సోమిదేవమ్మ :- అరుగో ఆమె యాజు :- మహాలక్ష్మమ్మా! కూర్చోమ్మా వీరు అప్పికట్ల నుంచీ వచ్చారు.. వీరయ్యగారు చెప్పారంటినే వీరే.

మహా :- మీరా తల్లి! ఈ దరిద్రురాలు ఎక్కడకూ వెళ్ళలేదు. ఏమీ చెయ్యలేదు. కనీసం అందరిలా పూజలు పునస్కారాలూ లేకపోయినా చేసుకున్న పెనిమిటికి ఇంత అన్నం వండి పెట్టుకోలేని నిర్భాగ్యురాలిని తల్లీ. పిల్లలూలేరు, తినటానికేం? కడుపునిండా తినటానికి ఉన్నది. యాజుల వారితో ఎన్నిసార్లు చెప్పుకున్నా, “మీకేం కావాలమ్మా? ఆడవాళ్ళకు పతివ్రతా ధర్మం చాలదూ?” అంటారు. దగ్గర లేని పెనిమిటిని ఎట్లా ఆరాధించాలో తెలియటం లేదు. మీరైనా చెప్పండి

యాజు :- ఆమె ఏమి చెప్తుందీ? ఆమె అదే మాట్లాడుతుంది.

మహా :- మీరు కడుపునిండినవారు. మీరు చెప్పకపోయినా ఆ తల్లి అయినా కొద్ది కొద్ది మాటలతో మా బోటివారికి దారి చూపుతుందేమోనని చెప్పుకుంటున్నా నాయనా. చేయలేకపోయినా ఆయనకు బదులుగా ఇంకా ఏమైనా దారి ఉన్నదేమో. ఏ దేవతను కొలుచుకోమంటారో అది కొలుచుకుందామని అడుగుతున్నా.

అమ్మ :- కొలుస్తూనే ఉన్నావుగా అమ్మా! ఏది కొల్చేదీ, ఏది కొల్చేదీ అని కొలుస్తూనే ఉన్నావ్. ఎవరు దగ్గర లేరనుకుంటున్నావో, ఎవరు కావాలనుకుంటున్నావో వారిని ఆవేదనతో ఆరాధిస్తున్నావ్. ఆరాధనంటే ఆవేదనేనమ్మా

మహా :- ఈ ఏడుపేనా?

అమ్మ :- ఏడుపంటే కళ్ళనీళ్ళు కావుగా అమ్మా? హృదయాన్ని దగ్ధం చేసే అగ్ని ప్రవేశించి దహనం చేస్తున్నది. ఆ దహనంలో సర్వమమకారాలూ, రాగద్వేషాలూ దహనం చేసే మహాయాగం. అదే సర్వసామాన్యంగా అందరూ రాగద్వేషాదులూ హఠయోగం ప్రారంభంలో ఉద్దేశాలు వేరుగా ఉండవచ్చు. అదే భక్తి. సర్వకాల సర్వావస్థల యందూ ఉన్నప్పుడూ అదే జ్ఞానం. అదే నిష్కామ కర్మ. అదే సర్వమని నా అభిప్రాయం.

మహా ః- ఇదంతా ఇందులో ఉన్నదని నేను ఏడవటం లేదుగా అమ్మా. అయ్యో! పెనిమిటి దగ్గర లేకపోయెనే. అందరి మాదిరిగా ఉండకపోతినే అని ఏడుస్తున్నాను. కానీ, ఇదంతా జ్ఞానమనీ, భక్తి అనీ ఏడవటం లేదుగా అమ్మా?

అమ్మ :- తెలిసి చెయ్యనిదీ, తెలియకుండా జరిగేది. అందరికీ ఉపయోగపడేదీ. తనకు తెలియనిదీ. దీపకాంతి తను వెలుగుతున్నానని తనకు తెలియదు. ఆ దీపాన్ని కూడా వెలిగించేవాడు వేరే ఉండచ్చు. దీపం హెచ్చుతగ్గులు వెలిగించిన వాడికి తెలుసు. కానీ, దీపానికి సహాయకారి అటువంటిదే నీ వేదన. ఆవేదన పూర్తి అయినప్పుడు స్త్రీల పాలిట ఆరాధ్యదైవానివి నీవే.

యాజు :- అమ్మా! ఎంత చక్కగా మాట్లాడావు. ఇటువంటి భాష ఇటువంటి భావం ఉన్నవని నేననుకుంటే ఎన్నో అడగాల్సింది. ఏదో అమాయకురాలిగా ఉన్నావ్. నీ జుట్టు, నీ కట్టు, నీ బొట్టు చాలా అమాయకత్వాన్ని స్ఫురింపచేస్తున్నది. అమ్మా! నువ్వడిగిన పతివ్రతా ధర్మాన్ని గురించి నీవు కొంచెం సేపు ఆమెకు చెప్పు తల్లీ.. నువ్వడిగినవన్నీ నీ ముఖతః వచ్చే తరుణం వచ్చింది. నిన్న నన్ను కూడా ఇప్పుడు అమ్మాయి అడిగినవే అడిగావు. ఆ అమ్మాయికి చెప్పమ్మా.

మహా ః- నే రాకముందు కూడా నా ప్రసంగమే వచ్చిందా ?

అమ్మ :- నీ మాట కాదమ్మా మన మాట

మహాః- నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అమ్మా?

అమ్మ :- ప్రపంచం మీద స్త్రీలున్నారు, ఇబ్బందులున్నాయ్. నీకంటే దరిద్రులూ ఉన్నారు. నీకంటే హింస పడేవారూ ఉన్నారు. కష్టాలకు పరిమితి లేదు. ఎవరికి ఏదో బాధ వారింతకంటే వేరే బాధ లేదనుకుంటారు. కష్టాలంటే ఇష్టం లేనివే!

(పై సంభాషణ శ్రీమతి బ్రహ్మాండం వసుంధరగారి “శ్రీవారిచరణసన్నిధి” నుంచి సేకరించబడినది)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!