శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించింది యోగ శాస్త్రమే. పతంజలి మహర్షి మనకు యోగసూత్రాలు అందించారు. వారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు..
- యోగము అంటే ఏమిటి? What is Yoga ?
యోగ శబ్దం ‘యుజ్’ అనే సంస్కృత ధాతువునించి వచ్చింది అంటే అర్థం కలుపుట. మేళనము.
“యుజ్యతే ఇతి యోగః” రెండింటినీ కలుపుట. జీవ పరమాత్మల ఐక్యం. నేను ప్రత్యేకంగా వున్నాను అనే భావన పోయి ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకోవటమే.
Yoga is the science of union. దేవుడు వేరు, మనం వేరు అనుకుంటూ జీవితాలు గడుపుతున్నాము. అందుకే దుఃఖం అనుభవిస్తున్నాము మనం ఆ divinity తో కలిస్తేనే, సుఖంగా వుంటాము.
- “యోగః చిత్త వృత్తి నిరోధః” చిత్తము యొక్క పరిణామమే వృత్తి. Change of mind from one object to another.
“చిత్త పరిణామ విశేషాయాః వృత్తయః”
మనసులో ఒకదానికొకటి సంబంధంలేని అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని విచారణ ద్వారా నిరోధించాలి. విజాతీయ తిరస్కార పూర్వక సజాతీయ వృత్తి ప్రవాహం. ఒకే Subject కి సంబంధించిన ఆలోచనలకు restrict చేయాలి. తద్వారా ఏకాకార వృత్తి.
అభ్యాస వైరాగ్యాలతో నిరోధించాలి. “అభ్యాసేనకు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే”.
- “యోగః కర్మ సుకౌశలమ్”
కర్మ కుశలంగా చేస్తే చాలు. జయాపజయాలతో పనిలేదు. అది యోగం. బంధించే కర్మని కూడ మోక్షం ఇచ్చేదిగా చేయటం.
- “యుజ సమాధా”
సమాధి అంటే ఏకాగ్రత. మనసు దైవాకారంలో ప్రవేశించటం.
- “సమత్వం యోగ ఉచ్యతే.”
దుఃఖంలో, కృంగిపోయి, సుఖంలో పొంగిపోయి, అలా వుండకూడదు. స్థిరంగా వుండాలి. అది యోగం. అదిలేనివాడు మోక్షం సంపాదించలేడు. “సిద్ధసిద్ధి
సమోభూత్వా సమత్వం యోగ వుచ్యతే” నిస్సంగంగా విధ్యుక్త కర్మలు చేయాలి.
- యోగము ఎందుకు?
సంసార చక్రంలో, అంటే జనన మరణ చక్రంలో Permanent గా తిరుగుతూ వుండకుండా, విముక్తికోసం. మానవ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. పరమ పురుషార్థం. మోక్షం. లక్ష్యసాధనకోసం చేసే పద్ధతి యోగం. Method employed to reach the goal is called Yoga.
III. యోగానికి ఆధారం ఏమిటి?
Non attachment. తామరాకు మీద నీటిబొట్టు లాగ వుండాలి. “సంగం త్యక్త్వా ధనంజయ” “Live in the world but let not the world live in you” నావ నీళ్ళలో వుండాలిగాని, నీళ్ళు నావలో వుండకూడదు కదా అన్నారు రామకృష్ణ పరమహంస.
Attachment – బంధకారణం Non attachment – వైరాగ్యకారణం
- యోగం ఎన్ని విధములు?
- కర్మయోగం – కర్మ యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం.
- భక్తి యోగం – భక్తి యోగం ద్వారా ఆత్మసాక్షాత్కారం
- రాజయోగం – మనో నిగ్రహం ద్వారా ఆత్మ సాక్షాత్కారం.
- జ్ఞానయోగం – జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం.
యోగి ఎలా అవుతాడు?
He sees himself in the whole universe and the whole universe in himself. మమాత్మా సర్వ భూతాంతరాత్మా”. అందరిలో వున్న “నేను”, నాలో వున్న ‘నేను’ అంతా ఒకటే. తనకెళ్ళ భరణిగారి పాట గుర్తొస్తోంది.
“నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు.
ఎ) నాలోన గల శివుడు నీలోన గల శివుడు, లోకమ్ములేల గలడు, కోరితే శోకమ్ము బాపగలడు.
బి) నాలోనగల శివుడు నీలోన గల శివుడు, మనలోన కలవగలడు, దయతోటి తనలోన కలపగలడు.
సి) నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయ గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు.
- ఫలం?
ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ, ఇహపర సుఖ అభిలాష లేని వారు ప్రాణ విసర్జన తర్వాత, తేజో మార్గంలో, బ్రహ్మలోకం వెళ్ళి, అక్కడ, బ్రహ్మదగ్గర కల్పాంత వరకు వుండి ఆ తర్వాత, ఆత్మ, అనాత్మ విచారణ బ్రహ్మద్వారా తెలుసుకొని పరమపదం చేరుతారు.
సాధన చతుష్టయ సంపత్తితో, ఆత్మ అనాత్మ విచారణచే, ఇక్కడే, జ్ఞానం పొందిన వారి ప్రాణాలు, ఎక్కడికీ పోవు. ఇక్కడే, అంతటావున్న పరమాత్మలో లీనమవుతాయి. “అత్రైవ సమలీయతే”.
ఘటాకాశం, మహాకాశంలో కలసిపోయినట్లు, శరీరం అనే కుండ పగిలాక, ఆత్మ పరమాత్మలో లీన మౌతుంది.
VII. కనుక ఏంచేయాలి? యోగ్యత ఎలా సంపాదించుకోవాలి?
- “యోగస్థః కురుకర్మాణి”.
యోగి కావటం compulsory. “యోగ హీనం కధం జ్ఞానం?”
“యదా సంహరతే చాయం, కూర్మోంగానీవ సర్వశః”.
యోగి కూర్మంవలె, తాబేలు వలె, అవయవములన్నీ, ఇంద్రియముల వైపు మరల్చకుండ, తాబేలు తన అవయవములు లోపలికి ముడుచుకున్నట్లు యోగి ఇంద్రియములను, వెనుకకు ముడుచుకుంటాడు. అంటే బాహ్యేంద్రియ విషయములనుండి, విముఖుడై, లోపలికి ముడుచుకుంటాడు.
యోగస్థుడు, దైవత్వమే ఆత్మ శక్తిగా తనలో దాగి వున్నది అని చక్కగా, అవగతం చేసుకొని, చిత్తచాం చల్యం లేకుండ వుండాలి.
- సాధన చతుష్టయ సంపత్తి పెంచుకోవాలి. అవి
1) నిత్యానిత్య వస్తు వివేకము
2) ఇహ ఫలభోగ విరాగము శమాది
షట్కసంపత్తి, ముముక్షుత్వం.
శమాదిషట్క సంపత్తి అంటే
- శమము – అంటే అంతరింద్రియ నిగ్రహము. మనస్సు యొక్క నిగ్రహము. ఆలోచనల నిగ్రహము. చిత్తప్రశాంతత.
- దమము కన్ను మొదలైన బాహ్యేంద్రియముల నిగ్రహం. (కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియముల) నిగ్రహం అంటే మన స్వాధీనంలో వుంచుకొని పనిచేయించుకోవటం.
- ఉపరతి – విషయములపై త్యాగబుద్ధి. బాహ్య అనాలంబనం. స్వధర్మాన్ని ఆచరించటం.
- తితీక్ష – సుఖదుఃఖాలు మొ॥ ద్వంద్వాల యందు సమబుద్ది. చలి, వేడి సహించటం. క్షమ. ఓర్పు.
- శ్రద్ధ శాస్త్రమందు, గురు వాక్యమందు విశ్వాసము, శ్రద్ధ.
- సమాధానం – ‘సమ్యక్ ఆస్తాపనం పరబ్రహ్మయందు చక్కగా బుద్ధిని వుంచటం. పరమాత్మ నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపం అని బుద్ధిలో తర్వాత ముముక్షుత్వం – నాకు మోక్షం కలగాలనే కోరిక.
VIII. ఈ యోగానికి ఎన్ని అంగాలు?
ఎనిమిది – అష్టాంగ యోగం.
వీటి అనుష్టానము వలన అశుద్ధి నశిస్తుంది. సత్వ, రజ, స్తమోగుణములతో కూడిన విపర్యయ జ్ఞానం అశుద్ధి. విపర్యయ జ్ఞానం భ్రమ. త్రాడుని పాము అనుకున్నట్లు. 24 తత్త్వములతో వున్నది ప్రకృతి. అదికానివాడు పురుషుడు. అనే జ్ఞానం అవగతమయ్యేవరకు ఈ భ్రమ వుంటుంది.
అష్టాంగములు:
- యమము: Moral code of conduct, Restraint. ఇందులో sub
Divisions-5.
ఎ. సత్యము = Truth. త్రికరణశుద్ధి, సత్యం బ్రూయాత్.
బి. అహింస – No Harm to self or others. శారీరక హింస, మానసిక హింస చెయ్యకూడదు.
సి. అస్తేయము – దొంగతనం చేయకుండ వుండటం. Stealing credit also for good work done by others.
డి. అపరిగ్రహము – Possessiveness – no.
ఇ. బ్రహ్మచర్యం – బ్రహ్మను గూర్చి తల్చుకుంటూ వుండటం. Thought current Lower చక్రాలవైపు పోతే శక్తి తగ్గుతుంది.
- నియమము: Self discipline. ఇందులో 5 Subdivisions.
ఎ. శౌచము – స్థూల, సూక్ష్మ కారణ దేహాల స్వచ్ఛత. Cleanliness, Purity, Thought Purity.
బి. సంతోషము శౌచంటే సంతోషం automatic గా వస్తుంది. యదృచ్ఛాలాభ సంతుష్టః.
సి. తపస్సు కాయిక తపస్సు – దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనం. స్వధార్మచరణం, వాచిక తపస్సు – అనుద్వేగకరం వాక్యం. ప్రియం బ్రూయాత్.
మానసిక తపస్సు భావ సంశుద్ధి, purity of Motive.
డి. స్వాధ్యాయం – Regular study, self learning.
ఇ. ఈశ్వర ప్రణిధానము – Surrender to God.
- ఆసనము : స్థిర, సుఖ ఆసనం, మరీ ఎత్తుకాదు, మరీ క్రిందాకాదు. సమంకాయ శిరోగ్రీవం. జింక చర్మం, దర్భాసనం + వస్త్రం శుభ్రమైన చోట కూర్చోవాలి.
- ప్రాణాయామం: దేహారోగ్యం. ఆయుర్వృద్ధి. 21,600 సార్లు శ్వాస పీలుస్తాము
ప్రతిరోజు. ప్రాణాయామం వలన 10,000 దాక తగ్గిపోతుంది. ఆ విధంగా ఆయుష్షు పెరుగుతుంది. మనో నిగ్రహం కల్గుతుంది. ప్రాణాన్ని పట్టుకుంటే మనస్సు ఆగిపోతుంది.
- ప్రత్యాహారం: మనస్సును ఇంద్రియ విషయములనించి మరలించుటయే ప్రత్యాహారం. శబ్దాది విషయములందు అనురక్తి తొలగించుట. అప్పుడు నిగ్రహించిన ఇంద్రియాలు చిత్తాన్ని అనుసరిస్తాయి.
- ధారణ: Retention. జ్ఞాపకశక్తి. వివేకానందుడు ఏకసంథాగ్రాహి. అవగాహన శక్తి. ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసుకొని, మనస్సుని పరమాత్మయందు నిల్పి వుంటే ధారణ.
- ధ్యానం: ఏ ధ్యేయం ఎన్నుకున్నామో, అక్కడే concentrate చేయటం. తైలధారవలె. ధ్యేయాకార వృత్తి ప్రవాహం రావటం. విజాతీయ తిరస్కార పూర్వక, సజాతీయ ప్రవాహం ధ్యానం. “ధ్యానం నర్విషయం మనః” ధ్యానంలో ధ్యాత, ధ్యేయము సంబంధం తెలుస్తూ వుంటుంది. జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు. “నీవు ఎన్ని పనులు చేస్తున్నా నిరంతరం నీ మనస్సు దేనిమీద లగ్నమై వుంటుందో అదే ధ్యానం నాన్నా”.
- సమాధి: ధ్యానం యొక్క పరాకాష్ఠ సమాధి. సమాధిలో ధ్యేయం మాత్రమే గోచరిస్తూ వుంటుంది. “అఖండ ధ్యేయ దర్శనం సమాధి. సమాధిలో చిత్తము ఎట్లావుంటుంది. ఉప్పు నీటిలో కరిగిపోయినట్లు ధ్యేయాకార వృత్తి మొత్తం ధరించేస్తుంది. వృత్తి నిరోధం అనేది వుండదు. సంప్రజ్ఞ సమాధి. బాగ తెలుసుకుంటూ వుంటాం. ధ్యేయం పోయి ఆ స్వరూపంలో లీనమై పోతాడు.
(పై Steps అన్నీ చేసి చేసి, ఈ level కి రావాలి)
- “అధాతో బ్రహ్మజిజ్ఞాసా”, ఇప్పుడు యోగ్యత వచ్చింది. అంటే సాధన చతుష్టయ సంపత్తిగల అధికారికే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత, అని వ్యాస భగవానుడు చెప్పినా, ఎవరికి, ఎప్పుడు వాడి (భగవంతుడి) అనుగ్రహం ప్రాప్తిస్తుందో, ఆ తరుణం ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఎంతకాలం యోగం చెయ్యాలి?
అహం బ్రహ్మాస్మి అనే భావం, అనుభవం అయ్యంతవరకు.
- “యోగినో నవ లక్షణః” యోగికి 9 లక్షణాలు.
- శ్రద్ధావాన్ – Faith. Don’t lose faith in yourself. Develop సూక్ష్మదృష్టి. Subtle Mind. Have hunger, thirst, urge to realize God?
- ధృఢ వ్రతః Firm determination, Strong resolution.
- సమదర్శి: Pain and Pleasure to be taken equally.
- సంతుష్టస్సతతం – తృప్తి, ఉన్నదానితో సంతోషంగా జీవించు. Work hard and earn. Be content with what you get.
- సంయమి: Self control. Senses are focussed outward. Turn them inward. By యుక్తాహార విహారస్య.
- నిత్యయుక్త – Only during prayer and meditation, we thank God. No. Every minute, keep yourself united with God.
“తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర”
- నియతమానస – Concentration. Mind will be steady. If you develop non-attachment, your mind will not go anywhere.
అనాసక్తః Unattached to ఫలం. “మా ఫలేషు కదాచన”
- ధీర = ధైర్యం Don’t lose mental balance.
“దుఃఖేషు అనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః” అలా వుండాలి. Develop mind so that you are not disturbed. Even if you are disturbed, try to reduce the frequency. అని పూజ్యశ్రీ ప్రేమసిద్ధార్ధ అన్నారు.
XII. యోగియొక్క గొప్పతనం, భగవంతుని మాటలలో:
“తపస్విభ్యోధికో యోగీ, జ్ఞానిభ్యోపి మతోధికః |
కర్మిభ్యశ్చాధికో యోగే, తస్మాత్ యోగీ భవార్జున”
(భ.గీ 6-46) అర్జునుని యోగి అవమని చెప్పాడు కృష్ణ భగవానుడు. మనందరినీ యోగులుగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ విన్నవించుకుంటున్నాను.
-: జయహోమాతా :