1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘రాజుపాలెం’ డైరీల నుండి (భాగవతము)

‘రాజుపాలెం’ డైరీల నుండి (భాగవతము)

Rajupalepu Ramachandra Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 6
Month : April
Issue Number : 2
Year : 2007

(కీ.శే. రాజుపాలెం రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహననను సరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెం శేషగిరిరావుగారు. అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

  1. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన, తమ్మిచూలికైన విబుధ వరులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతు ॥

శూలి = ఈశ్వరుడు, తమ్మిచూలి బ్రహ్మ, ఈ ఇరువురు భాగవతము = అను ముక్తి పదార్ధమును పొందియు, అనుభవించియు, ఇతరులకు చెప్పుటకు సాధ్యమైనది కానందున “అనుభవైక వేద్యమే ఐనందున “ఒక వేళ చెప్పిరనుకొనుట చిత్రముగా తోచును (అసంభవము) ఐనను ఆ స్థితి అనుభవించు వారలలో ‘తత్వబోధకులు’ (రమణ, సాయి, మొ॥) (విన్నంత) అట్టి వారల వలన విన్నంత, కన్నంత తత్త్వదర్శకులనియు, అనగా ఆ స్థితి అనుభవించువారలెట్లుందురో చూచినంత వరకు (రాజమండ్రి బాబా, కొత్తలంక యోగి) అట్టివారలు. వీరలుచెప్పినదియు, చూచినదియుగాక, తన కొలత ప్రకారము తెలిసికొనగల్గినంత తేజపరుతు తెలియ పరచగలవాడనని కదా?

  1. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుపలుకు పలుకగనేలా?” అని కదా? పలుకుటకు, చెప్పుటకు వీలు కానిదయ్యును, పలికించెడివాడు “రామభద్రుడు” ఐనందునను, “నేను” అనునది నాలో ఈషణ్మాత్రము లేనందునను ఆ ప్రభువగు శ్రీరామచంద్రుడే పలుకుచున్నాడని భావముకదా? తను కాక పరమాత్ముని పలుకైనపుడు “భవహరమగుట” సందియము లేదుకదా? కాబట్టి ఇతరముల కంటె ఈ సద్విషయమునే పలికెదను అని భావము.
  2. “రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ, వేధసే, రఘునాధాయ, నాధాయ సీతాయాః పతయే నమః”

ఎ) పై వానిలో ‘రామాయ’’అనుసంబోధనము, దశరథుడు, కౌసల్యవీరలకే చెందినది. అనగా వాత్సల్య భక్తి.

బి) ‘రామభద్రాయ’ సచ్చిదానంద స్వరూపమేస్వభావముగా గలవాడగుట, అట్టి ఆనందము నిర్వికల్ప సమాధియందు అనుభవించిన ఆనందమునుండి, చ్యుతముగాక నిర్భీజ సమాధి, రామానందము అను పేర్ల చెప్పుకొను నిర్వికల్ప సమాధి స్థితి భద్రముగా కలవాడు. దీనినే సహజ సమాధి అనుట కూడా యున్నది. సహజ సమాధి అననేమో తెలిసి అనుభవించువాడు, అచట ఆ స్థితిలో నుండి చెప్పునపుడు నేను అను అహం ప్రవృత్తి లేనందున, అట్టి స్థితి యందుండి పలుకునది రామభద్రుడే యగును. (వశిష్టుడు)

సి) ‘రామచంద్రాయ’ అనునది నీడలులేని పండు వెన్నెల అనుభవించు సమాధి నిష్ఠులైన యోగులు అరణ్య కాండలో సంచరించురాముని సంబోధించునది. అనగా వారనుభవించు విషయమునకే వారు పెట్టు కొనిన పేరు.

డి) ‘వేధసే’ వేద సామ్రాజ్యమును, వేదముల యందు ఎట్టి ‘బ్రహ్మ’ పదార్థమును గూర్చి చెప్పబడినదో అట్టిది ‘బ్రహ్మ’ అను పదార్ధము – వేద ప్రతిపాదితము.

  1. a) ‘రఘునాధాయ’ జటాయు, అహల్య, శబరి, మొదలగువారికి ముక్తి నొసంగినవాడు (రఘుకుల సంజాతుండు) అనగా వీరికి ఇతః పూర్వమే ఋషులవలనపరమాత్మ రఘువంశములో జనించుననియు, వారికి ముక్తి నొసంగ గలరనియు చెప్పియున్నందున వారు తమ పరిపక్వకాలము వరకు కనిపెట్టుకొని యుండి అట్లు సంబోధించిరట. ఎఫ్) ‘నాథాయ’ :- కిష్కింధకాండలో హనుమత్ సుగ్రీవాదులు వారి కపిసేన, వీరందరికి రక్షకుడు, నాయకుడు ఐనందున అట్లు సంబోధించిరట.

29) ‘సీతాపతి’ :- అని ఒక్క జనకుడు మాత్రమే సంబోధించు వాడట. ఇది తనకును కుమార్తె ద్వారా రామునికి గల సన్నిహితత్వము తెలుపునట. జనకజయగు తన కుమార్తె లోక సంగ్రహార్థము శ్రీరాముని వరించుట తెలుపును. తాను విదేహరాజ్యమున కధిపతి. అనగా దేహములేని రాజ్యము. నిర్బీజస్థితి. దీనినే విదేహముక్తిని అనుభవించు ‘జీవన్ముక్తిని’ లక్షణములు తెలుపునది అందురు. దేహముండగనే ముక్తిని అనుభవించుస్థితి (సహజస్థితి) అనగా ప్రకృతి పురుషులు సంయోగ స్థితి నెరింగి, తానానంద సమాధిన గల స్థితి గలవాడు అని అర్థమట. ఇది చెప్పినవారు వినినవారు వేదవ్యాసుని కుమారుడు “శుకమహర్షి’ – వేదవ్యాసుడన ఇదివరలో గురుముఖతః (గురు శిష్యపరంపరగా) వచ్చుచున్న వేద ఋక్కులను, విభజించి, క్రోడీకరించి, ఋగ్యజుస్సామ అధర్వణ వేదములుగా విరచించిన మహాపురుషుడు. వీరి వేదాంతర్గతమైన జ్ఞానమును పుత్రునిగా శుకమహర్షిగా పొందినవాడు అనగా వేదవ్యాసుని ఆత్మశక్తి పుత్రరూపమున కనినవాడు. శుకమహర్షి, ఆజన్మ సిద్ధుడు, అవధూత స్థితి కలవాడు కనుకనే శుకుని బొమ్మను చిన్నపిల్లవానిగా, దిగంబరునిగ చిత్రించుట సాంప్రదాయమైనది. ఈయన ఆవరణ రహితుడనియు ఎరుంగనగును. ఎచ్చోటగాని పాలు పితుకుటకు వలయు సమయము మించి యుండ నేరని వాడు ఏడు దినము లుండి భాగవత ముపదేశింపుటలోని ఘనతయు ద్యోతకమగును. ఇంకను తాను మాయావశుడుగాక “గిరిగీసి మాయ నంగీకరింపని” అనునట్లు ‘మాయ’ నే తాను నియమించ గల సమర్థత గలవాడు. “హ్రీంకార పంజర శుకీ” అను సంబోధనలో పండిన పండ్లనే అనుభవించునది శుకముని గదా. అనగా పండు పండిన మాదిరి ఉత్తీర్ణుడాయెనని గదా తెలుపును.

ఇక వినినవారు ఏడుదినములలో మాత్రమే గడువు కలదని ఎరింగి ప్రాయోపవిష్ణుడై, తదన్య మనస్కుడై ముక్తి వడయుటకు సిద్ధముగా (సాధన చతుష్టయసంపత్తి గల్గి) బీజముల నాటిన సత్ఫలితము నొసంగ తయారు కాబడిన క్షేత్రముగా, చిత్తము కలవాడు. ‘అట్లే అచటగల ఇతర సంయమపరులు మునులు, రాజులు, (మొదలు ‘ధర్మక్షేత్ర” చివర “అనన్యాశ్చిన్తయం”. గీత మధ్య భాగమంతయు విశదీకరణ)

(గురువు లెట్టివారుగ నుండవలయునో, శిష్యులెట్లుండవలెనో తెల్పును) భాగవతము అనుదానిలో పెద్దలు భా = భక్తి, గ = తత్వము (తత్ త్వం, సో = అది హం = జ్ఞానము, వ = నేను ము = 4. వైరాగ్యము త = ముక్తి అను వానిని తెలుపు ఉద్గ్రంధ మందురు. దీని పరమావధి ముక్తి నొసంగుట చేతనే, ఈ ముక్తస్థితి అనుభవైక వేద్యమేగాని, చెప్పుటకు అలవికానిది అనుటలోని ఆంతర్యము. ఇది అనుభవించువారలకే వేద్యము = తెలియును. తదితరులకు ఏదియో జరుగుచున్నట్లు అగుపడుచు తెలియుచు, ఏమి జరుగుచున్నదో తెలియనందున పామర భాషలో తరచు అర్థముకాని విషయములో” ఏమిటి ఈ భాగవతము” అను లోకోక్తి గూడ జనించి యుండునోపును.

  1. ఇది వరలో మనలో పలువురు భాగవతమును పలుమరు పఠించి యుండవచ్చును. కొందరు పెద్దల వలన విని యుండవచ్చును. కాని భాగవతమును దర్శించి (చూచి ఆనందించి) యుండనేరరు. ఇపుడు ఇచట జరుగునది యెల్లను ‘భాగవతమే’ కాబట్టి చాలా మందికి ‘ఇది ఏమిటి? అసలు ఇది ఏమిటి? అనుసమస్య పొడసూపక పోదు. (తప్పనిసరి) కాని నిజమరసిన ‘భాగవతము’ నే అనుభవింపుచున్న వారలము. ఏమి అనుభవించు చున్నారో ఎట్లు అనుభవించు చున్నారో మాత్రము చెప్ప నేరము. ఉద్గ్రంధములకు దార్శనికములను పేరు కలదు. దర్శించునవి – దర్శింపశక్తి సంపాదింప మార్గదర్శకములైనవి. మార్గదర్శకులచే – ప్రదర్శింపబడునవి మాత్రమే దార్శనికములనదగును. మనమందరమేల ఇచ్చటికి వచ్చుచున్నారము? దర్శనమునకు, అనగా చూచి ఆనందించుటకు. కాని చాలా మందికి ఏమి చూచుచున్నామో? ఏమి అనుభవించుచున్నామో, వ్యక్తము చేయశక్తి చాలక పోవచ్చును. కాని అనుభవించునది మాత్రము సమానమే.
  2. ఇక భాగవతములోని మొదటి అక్షరము ‘భక్తి’ – అనగా శ్రద్ధ అందుము. భయములేనిది భక్తి అనిన (నిర్భయస్థితి నొసంగునది కదా!) ఈ స్థితియే పర్యవసానములో జీవన్ముక్తస్థితి. ఇక దేనిని చూచిన భయము? జనన మరణ పరంపర నొసంగు ప్రాపంచిక, సాంసారిక విషయముల నుండి భయము. దీని నుండి భయము లేకుండుటయే ముక్తి. అనగా భయరహిత స్థితి.

“అచ్చపు చీకటి బడి, గృహవ్రతులై, విషయపు నిష్టులై చచ్చుచు. పుట్టుచున్ మిగుల చర్విత చర్వణులైన వారికిం ….. చెచ్చర పుట్టునే, పరులు చెప్పినదైన, యధేచ్ఛనైన, ఏమిచ్చిననైన, హరిప్రబోధముల్” అనగా సాంసారిక ధర్మము నుండి ముక్తి గల్గించు హరి ప్రబోధముల్ అని కదా. ప్రేరణములు కలుగ నేరవని కదా? కాని అట్లు కలుగనిదే, దర్శనమునకు వచ్చు ఆస్కారము లేనందున, వచ్చు సంస్కారమే ‘ప్రేరణ’ మని ఎరుంగనగును.

  1. ఇక ఈ భక్తికి మార్గమేది? “తను, హృత్, భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వము, వందనము, అర్చనము, ఆత్మలో నెరుకయున్, సంకీర్తనంబు” మొ॥ అను తొమ్మిది మార్గములు చూపబడినవి. కాని విచారించిన అన్నియు ఒక విధానములోని భాగములే అనియుతోచును. ఇట్లగుట ప్రధమమున తను, హృత్, భాష అనుటలో మనో, వా, క్కాయములు – త్రికరణ శుద్ధి కదా. ఇదియే గీతలో “ధర్మక్షేత్రే యగును. అప్పటికిగాని సత్పురుషులు అనగా సద్వస్తువుననుభవించు వారల యొక్క సఖ్యము = సహవాసము సామీప్యమున ఉండుట తటస్థించదు. అట్లు చేరివారు చెప్పు ఆప్తవాక్యముల = వేదభాష వినుటయే శ్రవణమగును. పుస్తక పారాయణము కాదు – అనుభవ సారము గ్రహించుటయే 2. పిమ్మట = అట్టి వారి దాస్యము చేయ నిచ్చ జనించుట (సేవచేయుట) – తదుపరి వందనము అనగా ‘ఆత్మార్పణము” అగును. అటు పిమ్మట ‘అర్చనము’ అనగా ‘ఆరాధించుట’ కలుగదు. ఈ ఆరాధాన ఒకప్పుడుండి మరియొకప్పుడూ లేనిదికాదు. ధారణయే ఆరాధన; సర్వకాల సర్వావస్థలలో ‘అవినాభావ సంబంధము కల్గి యుండుటయే ఆరాధన. అంతటగాని వారివారికి ‘ఆత్మలో నెరుకయున్ స్వతః అర్ధమై అనుభవించు యోగ్యత కలుగవు :- ఇవి ఇచటికి వచ్చువారల కెట్టెట్లు జరుగుచున్నదో వారే ఎరుంగ గలరు.

తదుపరి “ప్రజ్ఞాత్మున్, హరిన్నమ్మి – తాము అడవి నుండుట మేలు” – అనుటలో వచ్చిన పిదప ఏమి చేయవలెనో ద్యోతక మగుచున్నది. ఇచట గలవారు ‘ప్రజ్ఞ ఆత్మకలవారు – ముక్తి నొందినవారు, అననేమో ఎరింగినవారు అని తెలిసికొని, వారిని నమ్మి అనగా ‘తమవి అని తాము ఇదివరలో తలంచుకొనిన బాధ్యతలను’ అన్నియు వారిపై నిడి, అనగా సర్వధర్మాన్’ అనినట్లు తారు = వారు = తమరు అనగా ‘నేను’ అని చెప్పుకొనువారు ‘అడవి నుండుటమేలు’ అనగా అడవులలో ఉండమని కాదు – ‘నిశ్శబ్దముగా’ నిర్జన ప్రదేశములో’ అనగా సంకల్పములవీడి, కర్తృత్వములు పెట్టుకొనక, నేను చేయుచున్నాను పురుష ప్రయత్నము వీడి, అన్నియు భగవన్నిర్ణయములగు జ్ఞానముతో నుండుట అని సూచించును.

  1. ఈ భక్తి మార్గమును పెద్దలు 1. దాస్యభక్తి = హనుమదాదులకు శ్రీరాముని యందు గలట్టిది (సీతారామంజనేయానుసారము, నీ దాసుడు, నీరూపుడు, నీవే నేనని కదా!) 2. వాత్సల్య భక్తి = దశరధునకు, యశోదకు మొదలైనవారికి తమ పుత్రుని యందుగలది. 3. స్నేహభక్తి = అర్జునాదులకు కృష్ణుని యందు, 4. బంధు = ధర్మజ, భీములకు, పృధకు (కుంతీదేవికి) గల భక్తి. 5. మాతృభక్తి = తల్లియెడ పిల్లలకు గల భక్తి ఇట్లే మధురభక్తి. దీనినే ‘పరభక్తి’ అనియు చెప్పుదురు. ఇది ఉపమానపూర్వకముగా వేరే చెప్పలేక, పతివ్రతయైన భార్యకు భర్తయెడ గల అనురక్తి అని చెప్పుట సాంప్రదాయమైనది. కాని ‘పరభక్తి’ అను పరశబ్దములోనే సారలౌకికము’ అని ద్యోతకమగును. అనగా ఈ ప్రకృతి సంసర్గములేని పరవస్తువు నందు గల జిగీషభక్తి. జీవునికి పరమాత్మ యందు గల భక్తి – ఇది స్వతః సిద్ధమై యున్నందునను, పరమాత్మ భాగమేయైన “శివుడు తన్ను మరచి జీవుడైనాడు’ అనినట్లు జీవత్వమెరింగి ‘బింబ ప్రతిబింబ’ న్యాయములో అచటగల అనుభవములు అనిర్వచనీయములైనందునను ఇట్లు చెప్పియుండిరి. దీని పర్యవసానమే అద్వైత

శ్రీకృష్ణ చైతన్యాదులు శ్రీవైష్ణవులు మొదలగువారు, శంకరులు చెప్పిన అద్వైత స్థితి కంటెను అనగా సాక్షిత్వ స్థితి కంటెను, విశేషమైనదిగా పరిగణించి వైష్ణవాగమములలో, చతుర్విధ వ్యూహములు కలవనియు, శ్రీమహావిష్ణువు భగవంతుడన షడ్గుణైశ్వర్య సంపన్నుడగుట, ఈ షడ్గుణములలో శ్రీలక్ష్మి అనపాయినిగా పరమాత్మయందే ఉండుననియు, ఏ రెండు ఐశ్వర్యములు కలసినను ఒక వ్యూహ మేర్పడుననియు, ఇట్లు వాసుదేవ – సూత్రాత్మగా నుండునది, సంకర్షణ వ్యూహము బుట్టిన సంఘర్షణ జరిగిననే, సత్యము బయల్పడునని, తదుపరి దీని విశేషమే ప్రద్యుమ్న = వెలుగు రూపమనియు (జ్యోతి స్వరూపము) తదుపరి అనిరుద్ధ వ్యూహము ఆటంకము లేనిది = అంతా ఐనవి ఆటంకము అడ్డులేనిది వరకుగల స్థితులను వర్ణించియున్నారు. దీనినే ‘అమ్మ’ అనుపదమునకు ‘అంతులేనిది, అడ్డులేనిది’ అని అమ్మ చెప్పుట వినియున్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!