(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము -ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
అవతార్ మెహర్ :
వీరిని అవతార్ మెహర్ అనుటయు విని యున్నారము. శ్రీ వీరికి “బాబాజానీ” యను ఒక యోగిని కరస్పర్శచే బాహ్య స్మృతులు నశించెననియు, శ్రీ ఉపాసనీ బాబాగారు ‘బాహ్య స్మృతులు కల్గించుకొనుట యెట్లో తెలిసి యుండి రనియు అందుచే వీరు తమకు ఇరువురు గురువులు అనియు చెప్పుకొనుచున్నారు. కదా? వీరు తాము “చెప్పునది లేదనియు, జాగృతి నొసంగుటయే’ తమ విధానమనియు చెప్పుచున్నారు కదా?
శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞానులకు, తమకు అభేద ప్రతిపత్తి గలదు. కావున తమ బోధకును, వారల బోధకును భేదముండనేరదు అని కదా ప్రవచించిరి. ఇట్లే ప్రకృతము హృషీకేశము నందలి ‘శివానందులకు’, పుట్టపర్తిగల ‘సత్యసాయి’ నిసహితము, అవతారమూర్తులనుట వినుచున్నారము. అట్లగుట పైచూసిన అవతార పురుషులలో, అందరు అనుభవించు స్థితి, ఒక్కటియే యగునని ఎంచుకొనినను వారు వారొనర్చు బోధలను వేరుకానేరవు కావునను, అందరి యెడ సమాన ప్రతిపత్తి ఉండియు ప్రస్తుతము నేనెరిగింప తలచిన ‘అవతార విభూతిని’ కూడ కొంత ఎరింగింప దలచి, పై వారిని ప్రామాణ్యముగా తీసికొని యున్నాను. ఇందుచే నెవ్వరేని, నాకు వారి యెడ భక్తి విశ్వాసములు లేవని ఎంచ కుందురు గాక.
“వీరందరును, కారణ జన్ములైన, దైవకార్య నియోజకులగుట నిస్సంశయము”
నాకు స్వయముగా “అమ్మ” స్థితి నెరుంగగల శక్తి లేనందునను, తగినంత అనుభవము లేనందునను, పైవారిని ఆదర్శముగా తీసికొని, శాస్త్రము నిర్దేశించిన విధానముల పరిశీలించిన పిదప, మా ‘అమ్మ’ మా జీవితములలో ఎట్లు ప్రవేశించినదియు, ఎట్లు అవినాభావ విభూతి నొసంగు చున్నదియు చెప్పనెంచి, ముందుగా పైవారి జీవిత విశేషములు పొందుపరచటమైనది. సత్య పురుషులు జీవితములును, వారనుభవించు స్థితులను, ఎవరికి తగ్గకొలతచే, వారు కొలువ నేర్తురు గాని, అట్టి వారి యదార్ధస్థితి నెరుంగుట కట్టి సమాన ప్రతిపత్తిగల వారకేట ఎరింగియు, అవతార పురుషులనదగు వారల జీవితముల నాధారముగను, శాస్త్రవాసన చేతను నా చేయు విశ్వాసములు నాకొరకైనవి గాన ఇతరులన్యధా భావింప వలదు.
- శ్రీ రామకృష్ణ పరమహంస చిన్నతనము నుండియు, కాళీమాతసేవ యెనర్చుచు, అద్వైతానుభూతి నొందుటకు “తోటపురి” గారిని గురువుగా స్వీకరించిరి. అప్పటికి వీరి వయస్సు నెరుంగనుగును. వయస్సు 18.
- శ్రీసాయినాథుడు శ్రీ వెంకూసా గారిని గురువుగా బడసిరి. శ్రీ వెంకూసాగారు, ఎట్లు ఒట్టిపోయిన గోవు నుండి, పాలు పితికించి, సాయినాధునికి ప్రసాదముగా నిచ్చి, ఉత్తరదిక్కుగానే శాసించినదియు, తరువాత 17వ సంవత్సరమునగాని, పెండ్లి వారితో ‘షిర్డీ’ యందగుపడునంత దనుక ఏమి చేయు చున్నది, ఎచ్చట యున్నది మన మెరుంగము.
- శ్రీ ఉపాసినీ బాబాగారు కూడా శ్రీ సాయినాధు ననుగ్రహముచే నంతవారైరి. కాని మిగిలిన కొరవ మాసములు కూడ ఉండి యుండిన ఎట్లుండెడిదో ఊహింపవలసి యుండును. వీరి కప్పటికే 40 సంవత్సరములు ఉండును.
- మెహర్బాబా గారున్నూ ‘బాబాజానీ’ ‘ఉపాసినీ’ బాబా గారల గురువులుగా నెంచు కొనుటయు విని యున్నారము. వీరికి 17 సంవత్సరముల నుండియే. 5. భగవాన్ రమణ మహర్షి మాత్రము తిరువణ్ణామలై ఈశ్వరుని తండ్రిగా భావించుకొని, తపమొనర్చిరనియు, ఇతఃపూర్వమే అచటగల ‘అవధూత స్వామి’ శేషాద్రి స్వామి గాక మరి యొకరు వారికి గురుతల్యులనియు విందుము. వీరికిన్నీ 17 సంవత్సరముల అనంతరమే.
అట్లగుట అమ్మకు గురువుగారెవరై యుందురను సంశయము పొడసూపక మానదు. మన మెరింగి నంత వరకు తమ 26వ సం.న బాపట్లలో గల దేశిరాజు బాపారావుగారి తల్లి యగు ‘శ్రీ రాజమ్మ’ గారి వద్ద కేగుట అందరెరింగినదే. అప్పటికి శ్రీ రాజమ్మగారు, మంత్ర శాస్త్రము మీద నాధారపడి పూర్వ జన్మ పరిపాకమున ఎక్కుడు సాధనలోనర్చి, దరిగానుకున్న సమయమున ‘అమ్మ’ శ్రీవారికి సద్గతి నొసంగుటకును అద్వైతానుభూతి నొసంగుటకును మాత్రమే వారిని దర్శించి యుండ నోపుదురనిన అతిశయోక్తి కానేరదు. పై రాజమ్మ బామ్మ గారికిని ‘అమ్మ’ కును జరిగిన సంభాషణ తిలకించినచో, వారి నుండి అమ్మ గ్రహించియుండిరో, వారికే ఎరుక కలుగచేసిరో తెలియనగును. (వివరములు వేరుగా జీవితము నందీయబడినవి)
జననకాల విశేషములు చూచినను, 2,3వ సంవత్సరములు అనుభూతుల వల్లను, తన ఏడవ సంవత్సరమున శ్రీ కల్యాణానందభారతిని దర్శించుట మొదలు, తమ 11వ యేట పర్యటనల వల్లను, తదాది నేటివరకు గల అనుభవముల బట్టియు, ‘అమ్మ’ ‘ఆజన్మసిద్ధి’ గల మాత యని తోచక మానదు. ఈయమ ‘అవతారమూర్తి’ కానోపుట జన్మ తదాది నేటి వరకు గల వానిని పరికించిన, ప్రతివారికి స్పురించును.
అవతార మన నెట్టిదియో కొంత పరిశీలించి, వీనిం బట్టియు, ‘అమ్మ’గా జన్మ తదాది నేటి దనుక జరిపించిన విశేషముల బట్టియు, ‘అమ్మ’ అవతార మగునో! కాదో! ఎవరికి వారే నిర్ణయించు కొన గల్గుదురు.
- సామాన్య మానవులు, వారి వారి పూర్వ జన్మ సంస్కారముల జన్మించుటయు, అవతారములకు సంస్కారములు లేనందున వారికై వారలవతరింతురనియు.
- జీవులు వారి వారి కర్మానుభవ మొందుచుండ, అవతారము లేదో లోక సంగ్రహార్ధము వత్తురనియు.
- అవతరించిన, తాము చేయదగు బృహత్కార్యమెట్టిదో, అవతరణ తదాది, పూర్తి యగు వరకు తామెరింగియే యుందురనియు.
- వారు తమ మనస్సుల సృష్టి గావించుకొని పిదప వత్తురనియు అనగా తాము కర్తగాయుండి, కార్యకారణముల నెరుంగుటచే, ఎట్టి స్థితిలోను ‘శాంతము’ వీడజాలరనియు,
- జీవులు ద్వంద్వములచే బద్ధులై యుండ, వారు ద్వంద్వాతీతులగుట. 6. పంచభూతములు జీవులు బద్ధుల చేయ, వారు త్రిగుణాతీత స్థితి నందు ఉందురనియు
- సిద్ధులనునవి (మంత్ర, మౌలిక, యోగ, జ్ఞాన సాధనలు సాధించినవిగాక జన్మతః వారి యందే యుండుననియు
- సామాన్యులు మాయా బద్ధులగుట జాలుదురనియు. తాము మాయను నియమింప
- పై వానిని బట్టి తమ కార్యము నెరవేర్చుట గాక, స్టీమరు మాదిరి ననేకుల నుద్ధరింప గల్గుటయు.
అవతారముల విశేషము నెరుంగుదురట
మనము శ్రీ రామావతారమున ఆదర్శమానవు డననేమియో, వారెట్లు స్వధర్మములు నెరవేర్చవలయునో చూసి యుండిరనియు శ్రీకృష్ణావతారమున మానవుడాదర్శ ప్రాయముగా ‘నిష్కామమకర్మ’ యన నెట్టిదో గీతయెందుపదేశించెనని, పలువురి అభిప్రాయము. ఇట్లే “1. ఆదిశంకరులు, 2. రామక్రిష్ణ పరమహంస, 3. సాయిమెహర్ మొదలగువారు ఎట్లెట్లు మానవుల నుద్ధరించినది చెప్పుకొని యున్నారు మొదటి ఇద్దరు తాము సన్యాసాశ్రమము పొంది శిష్యులకు – సన్యాసాశ్రమ మొసంగి ఉద్ధరించిరి. మిగిలినవారు తాము సన్యాసులయ్యు శిష్యుల గృహస్థులుగనే యుంచి “పరమార్థమును గ్రహించిరి.’ ‘అమ్మ’ యనిన ఆయమ ఆదర్శ గృహిణిగా యుండి, గృహస్థులుగనే ఉద్దరింపు తెరంగెరిగింప అవతరించి యుండనోపునని తోచుచున్నది. ఈ యమ “రామక్రిష్ణ ప్రవచించినట్లు “గృహస్థాశ్రమము కోటవంటి దనియు” సన్యసించుట యన కోటవెలుపల యుద్ధము చేయుల – నేల విడిచి సాముచేయుట వంటిదనును పై వారందరును శాస్త్రము నందింతవరకు ఎరుకపరచిరో అంత దనుక ప్రత్యక్షముగా నెరుక పరిచిరో లేదో యను సంశయము పొడమును.
కృష్ణపరమాత్మకును, అమ్మకూ గల పోలికల నిదివరకెరింగించియున్నాను. ఈ యమగారి విధానములో మతములోగల ‘orthodoxy’ కనపడదు. “రాగ ద్వేష రాహిత్యమే” సులభ మార్గమనియు, ఇందుల రాగమొక్కటియే తక్కుంగల వాటినే కూర్చుకొనగల్గుట – నిష్కామ మన నేమో తెల్పుచున్నారు. తెలుపుట యన ప్రత్యక్షాచరణము చేయించి, అనుభవింపజేయు చున్నారు. ప్రేరణయను శక్తిచే ప్రతిజీవి ఎట్లు నిర్ణయానుసార మెట్లు జరిగించు చుండినదియు సర్వము సామాన్యమైన వారిచే ఎట్లు ముక్తి బడయగల్గుదురో ఆచరణ పూర్వకముగా ఎరింగించు చున్నారు. ఈ యమగారు ‘రాగద్వేష రహితయగు’ అనసూయాత్వము నందుండుటచే మాతృత్వమననేమో, రక్షణ అననేమో స్వయముగా నిరూపించు చున్నారు. ‘అమ్మ’ సంకల్పమన నేమియో వేర్వేరుగా చెప్పియున్నందున, వాటి నిచ్చట పొందు పరచుట లేదు.
ఈ యమగారు
- ఆ జన్మ సిద్ధియనియు
- సర్వమునకు నిర్ణయమొకే పరి జరిగియుండి ననుటయు (సర్వజ్ఞత్వము)
- మృత్యుంజయము – చిరంజీవత్వము అననేమో
- “గుణమ గుణాతీత” – “ద్వంద్వమయి – ద్వందాతీతయన”
- పాంచ భౌతికముల నెంత వరకు స్వాధీనపరచు కొనినది.
- పుట్టుట – అవతరించుట గల భేద నిరూపణము
- సారహీనమైన సంసారము కాదు – సార సహితమైనది.
- ఆదర్శ గృహిణిగా యుండి – పతివ్రతా ధర్మమెట్లుండునో – ధర్మము, సత్యము వీనిలోని భేదములు.
- ఆదర్శ సన్యాస మెట్లుండవలెనో
- నన్ను చేరిన, చూచిన మిమ్ముల రక్షింతుననుటకాదు – “రాబట్టు కొనుట ఉద్ధరించుట” రెండూ తనవే (సర్వ సంకల్పములు అమ్మ యందే యగుట)
అని ఋజువు పరచు నిమిత్త మావిర్భవించినదేవతా రూపమై యుండ నోపునను విశ్వాసము కలుగును. సామాన్యులి తరువొనర్పలేనివి జరిగించి యుంట ‘అమ్మ” ఎవరై యుండ నోపుదురో? అనునది సహజముగా అచటికి వచ్చువారల సందేహము. విశేషించి జీవితములోని ఘట్టములనే తీసికొన్నందున విషయము సుబోధకమగునని మనవి.
“అవతారమూర్తుల జీవితమంతయు ఒక గొప్ప సిద్ధి ప్రదర్శనము”
అనంతమైన ఆదిశక్తి ఆది మధ్యాంత రహితయై నందున, ఒకపరి ఉండి మరి యొక పరి లేనిదికాదు. అట్లగుట కాల నిర్ణయము చేయనలవి కానిది యగును. కావున ఏయే వేళల, ఏయే అవతార విభూతులలో దైవాంశలు పొడచూపునో అట్టి దైవాంశ సంభూతులెల్లరు, ఆదిశక్తి నుండియే ఆవిర్భవించిరనిన సమంజసము కానోపును.
కావున మన మెరింగి నంత వరకు బుద్ధ భగవానుని కన్న తల్లి మాయాదేవి, శంకరుని జనయిత్రి ఆర్యాంబ, ఏసుక్రీస్తును షుమారు చిన్న వయస్సుననే చెడకుండ కనిన మరియమ్మ (Virgin Mary) మొదలుగా గల విభూతులన్నియు ఆదిశక్తి యగు అమ్మ ప్రతిరూపములే యని ఎరుంగ నగును.