నాటికి నేటికీ అమ్మను చూడగానే అమ్మ రూపంలో ఒక ‘అలౌకికత’ అందరినీ ఆకట్టుకుంటుంది.
అమ్మరూపంలో ప్రకాశించే కమనీయత, అమ్మ కన్నుల్లో ప్రసరించే కారుణ్యం అందరికీ అనుభవైక్య వేద్యం.
గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి ? అని గొప్ప సంఘసంస్కర్తగా బోధ చేసింది.
అమ్మది సర్వసమ్మతమైన మతమే దైవత్వం. అమ్మ
అవతరించింది “మానవత్వంతో అన్ని మతాలనూ సమ్మతింప జేసే విధంగా అమ్మ జీవనం సాగింది.
నేను గురువును కాను – మీరు శిష్యులు కారు
నేను దైవాన్ని కాను – మీరు భక్తులు కాదు
నేను అమ్మను – మీరు బిడ్డలు, అని తన అసాధారణ మాతృత్వాన్ని ప్రకటించింది.
వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి సంబంధించిన అనేక విషయాల మార్గదర్శనమే మాతృత్వం.
“తల్లి రక్షణ కాదు, రక్షణే తల్లి” గా పుట్టింది. మొదలు ఇప్పటికి, ఎప్పటికి, ఇంకెప్పటికీ తన సునయనాలతో, చిరుమందహాసంతో ఆహ్వానిస్తూ కరుణను జూపుతూ “రమ్మని” పిలిచేది రా రమ్మని పిలిచేదీ” అమ్మే.