రావమ్మా అనసూయమ్మా!
మా పూజలు అందుకో, మా ఇంటి వరలక్ష్మి! మము బ్రోచి కాపాడి, కరుణించు మా తల్లి! రావమ్మా రావమ్మా.
రావమ్మ అనసూయా ! రావమ్మా రావమ్మా
నీ సేవకు మనసారా వేచి యుంటిమి తల్లి, కరుణించి కాపాడి దయ చూపు
మా తల్లి రావమ్మా, రావమ్మా రావమ్మా
అనసూయా ! రావమ్మా,
మా పూజలు అందుకో, మా ఇంటి మహలక్ష్మి! మము బ్రోచి కాపాడి
కరుణించు మాతల్లి రావమ్మా రావమ్మా
రావమ్మ అనసూయా! రావమ్మా
మా పూజలు గైకొని మము దీవించుము తల్లి!
మనసారా దీవించి కనికరించుము తల్లి రావమ్మా, రావమ్మా
రావమ్మా అనసూయా ! రావమ్మా రావమ్మా
నీ చల్లని చూపులతో కరుణించి కాపాడు చక్కని నీ రూపు మనసార గాంచితిని
రావమ్మా, రావమ్మా రావమ్మ అనసూయా ! రావమ్మా రావమ్మా !