మొదటి అంశం
ఉత్పలమాల
అందరి మాతృమూర్తి వలె యన్నము పెట్టిన యన్నపూర్ణగన్
అందుకొనంగ ప్రేమమయి నన్నటులన్ జనయిత్రిగన్ సదా
తిందుము రండటంచు తన తీపి పదంబులదోడ పిల్చి తా
నందరి గుండెలందు మరి యమ్మగ నిల్చెను లోకమాతగా
ఉత్పలమాల
ఆకలి దీర్చగ నువిన యాకొని యుండిన బిడ్డ డాకలిన్
పీకల దాక భోజనము పెట్టగ తల్లికి కల్గు తృప్తిగా
నే కులమైన యమ్మ తను నే సమయంబయిన న్నొసంగె నే
పాకము జేసి వడ్డనను పంక్తుల వారిగ పెట్టి జూపెతా
ఉత్పలమాల
ఉత్తగ భేషజంబు కని ఉత్తర కాలము గూర్చి పల్కులన్
బిత్తరపోవు రీతిగను బెగ్గలికంబగు ముందు మాటలన్
మత్తును గల్గజేయగల మాయపు చేష్టలు జేయకన్ సదా
చిత్తమునందు నమ్మకముచే పయనించగ నమ్మచెప్పెతా
రెండవ అంశం
మత్తకోకిల
దుష్టశిక్షణకై పరేశుడు దుష్టులందరినీ తనే
శిష్టరక్షణ జేయగన్ నిల చేసి చూపెగ నెన్నియో
కష్టమౌ నవతారమెత్తుచు కశ్మలంబులు మాపగన్
క్లిష్టబాధల నమ్మరూపున కీర్తినొందుచు దీర్చెగా
ఉత్పలమాల
పిల్లి నొకప్పు డక్కడికి వేగమె తిండిని దెచ్చి కునకై
నల్లరి జేయుచుండెనని యక్కడి వారలు కొట్టబోవగన్
పిల్లియు గూడ పిల్లలకు బెట్టగ నేదియె దెచ్చియుండె-మీ
పిల్లలకు మీరటులు పెట్టనె లేదయనెన్ దయామయీ
మత్తకోకిల
జీవనంబను నాటకంబున జేయు చేష్టల తీరుకున్
పావనంబగు ద్రోవ జూపుచు బాధ తీర్చిన యమ్మయే
కావలిన్ తనబిడ్డ కోసము కన్నతల్లిగ జేయుచున్
మావి బిడ్డను కప్పునట్లుగ మాతరక్షణ జేయుతా
మత్తకోకిల
పిల్లలందరు మాట పక్కన బెట్టుచుండిరి యన్ననూ
కల్లబొల్లిగ చాడిల న్మరి కక్షపూరిత చేతలూ
ఇల్లుకాదని సన్యసించుట నిట్టివాదనలన్నిటిన్
తల్లిదీరున నచ్చజెప్పును తానె పృధ్విన మ్రొక్కగన్
మూడవ వ్యాసం
ఇంద్రవ్రజము
రాజేశ్వరీమాతగ రక్షనిచ్చెన్
యాజమ్ము దోడ న్మరి నాకలే లే
దే జాతి కన్నట్లుగ దీర్చె నమ్మే
ఈజన్మ ధన్యంబగు ఈమెతోడన్
మత్తకోకిల
అందరిల్లని పేరుపెట్టెగ యమ్మ తా తనయింటికిన్
విందుభోజనమే నిటన్ యని పేరుపేరున జెప్పెతా
అందుకొన్మని యార్తులందరి నాకలిన్ కనిపెట్టుచున్
బంధు వౌనటుల స్తనింటిని పాకశాలగ మార్చెనే
కందం
చావు బతుకు మధ్యన గల
నో వృకరాతినిని జేరి యొద్దని యన్నన్
తా వినక సాగనం పెను
ఠీవిగ దానినిక నమ్మ డీలించక తా
మత్తకోకిల
కోరిక ల్విడిపోవ వాటిని కోరుటన్నదిగూడ-నో
కోరికేగద యంచుదెల్పెను – గొప్పసూక్తియెగాద – నీ
తీరుమార్చుకొనంగ జెప్పెను ధీరమున్కలిగించగన్
గారవం బది గల్గిదీరును గాదె – పృధ్విన యమ్మకున్
భూతిలకము
ఏమినొసంగిన దేవదేవుడునెందుకోయనిదల్చుమా
ప్రేమను పంచుమ శత్రువైననుప్రేమనిచ్చుచునుండుమా
కామము లేనటువంటిభక్తిని కల్గుయుండుమనీవనెన్
క్షేమము గోరుచు నీతులన్వినగీతవోలెను జెప్పెతా
మత్తకోకిల
దిక్కులేదను వారికి న్నొక దేవతై నభయం బిడున్
ప్రక్కనుండెడి వారలందరి బాగుకోరెడి తల్లిగా
మక్కువ కలిగించు తల్లియె మాత యన్నటుల న్సదా
ఎక్కువై నటువంటి దామెయె నెల్లరున్ మరి మెచ్చగన్
కందం
అల్లరిచే కొడుతుండెను
పిల్లడు నింటిన బయటను- వేదనచే నో
తల్లి వినిపించగ
నిల్లుబయట వేరుకాదు నీకొడుకు కనెన్!
కందం
అపజయములు గల్గినపుడు
తపములు జేయ ఫలమేది దయలేదా-నే
శపధము వీడెదనను – మన
కపటపు నాలోచనలను ఖండించును తా!
నారాచ
ఆధ్యాత్మికంబు బోధనల్, విద్యార్థులన్నరీతిగన్
తా ధ్యానమందుజెప్పెనే నీధ్యానరీతి మారగన్