శ్రీశ్రీశ్రీ విశ్వజననీపరిషత్ అంటే అద్వైత బ్రహ్మస్థితి. అద్వైత బ్రహ్మలుగా కొనియాడబడుచూ, విశ్వజననికే మణి హారాలుగా జిల్లెళ్ళమూడి గ్రామానికే వన్నె తెచ్చిన వారసులుగా, మకుటం లేని మహారాణులుగా, బాపట్ల తాలుకాకే వెన్నెల విరజిమ్మే వారలుగా, కలియుగ స్త్రీ జాతికే గర్వకారణంగా వుంటూ భూలోక వాసులకు తృప్తిని, ముక్తిని కలుగజేయాలనే తలంపుతో, నిరంతరం అమ్మ నామా మృతంతోనే పెదవులను తడుపుకొంటూ, కళ్ళు చెవులను – కాలభైరవుడు చేసే ఆగడాలను నుండి ప్రజలను రక్షిస్తూ, ఆ మాతృమూర్తిని ఎడతెరిపిలేని ప్రార్థనలతో ముంచెత్తుతూ, వెళ్ళే వారికి అమ్మవారి ప్రసాద భాగ్యాలను ప్రసాదిస్తూ, వచ్చేవారికి వందనాలతో ఆహ్వానించి అన్నపూర్ణాలయ శోభకు పులకరింపచేసి సేదతీరుస్తూ ఓంకార జీవనదికి సూర్యనమస్కారములతో అర్ఘ్య జలాదులను సమర్పిస్తూ. రూపాయి దమ్మిడీకి చలించక, సంపూర్ణ ఆత్మార్పణతో, ఆనాటి జీవన విధానాలకు, అచంచలమైన విశ్వాసంం విస్తృతంగా వున్న ఆనాటి నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావాలు. ఎంతైనా ‘old is gold’ అనే నేపధ్యంలోనే వున్నారు ఆనాటి నుండి ఈనాటివరకు వున్న – అప్పటి వారే, ఈనాటివారు, వారే వీరు. వారందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశాంతచిత్తులై వందనాలుఅర్పించుకొందాం.
అందరి మడి – దడి, తప్పు – ఒప్పు, పాపం- పుణ్యం, మంచి – చెడు, అదృష్టం – దురదృష్టం, పేద – గొప్ప, ఆడ – మగ, కులం – మతం, ఆచారం అనాచారం, నావారు – నీవారు, ఏకాదశి ఉపవాస పారాయణలు, తిథివార నక్షత్రం వారం-వర్జ్యం, ఉపోషం-గిపోషం, మానం – అభిమానం, వజ్రాలు-వైఢూర్యాలు, బంగారం – గింగారం, పగడాలు- ముత్యాలు, వెండి గిండి, పట్టుపరుపులు-వస్త్రాలు, లేని ఏకాకి ‘లోక రక్షకి’ అనే బిరుదాంకితురాలై ముక్కోటి దేవతలక్కూడా ఆశ్రయురాలైంది. Any doubt ? ….
పురప్రముఖులు : అల్లుడు సర్వ స్వతంత్రుడని తెలుగు భాషలో ‘ఒక సామెత వుంది’. దీనికి ఇక్కడ మంచి గిరాకీ ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక మూల, మరో మూల శిలాశాసనంగా వచ్చి వుందామనుకొని లక్షలు వెచ్చించి ఇళ్ళు కట్టుకోవడం అమ్ముకొని జెండా ఎత్తేయడం అనగా వెళ్ళిపోవడం, మరో మూల వృద్ధాశ్రమం, మాతా శిశు సంక్షేమ పధకాలు, పునర్వివాహయోగాలు, underground irrigation, pure water supply branch, guest houses, U.S.A., London లో నివాసం ఏర్పాటు చేసుకొని వున్న, వారెక్కడవున్నారోనని తెలియచేయాలనే కాంక్షతో విదేశీ కరెన్సీని పంపించే వారి నామగోత్రాలను ప్రచురించుకోవడం.
అమ్మ బంగారం – వాస్కోడిగామా అమెరికాకు మార్గం కనుగొన్నాడు. ఇది చరిత్ర బద్ధం. స్వామి వివేకానందుల వారు కాషాయ వస్త్రాలను తన 30వ యేటనే ధరించి అమెరికా నగరంలో చికాగోలో భారతదేశపు ఔన్నత్యమును విశదీకరించారు. అప్పుడు వారు వేసిన బాట-కోటానుకోట్ల భారతీయులకు, ఈనాడు ధనార్జన నిమిత్తమై ఉద్యోగరీత్యా వెళ్ళడం అందరికీ తెలిసిన విషయం అమ్మనాతో ఒక రోజు-
అమెరికా వెళ్లామా రమా అనడం నా చెవుల్లో ఇప్పటికీ రింగుమంటుంది.
భవిష్యత్ను బంధిస్తుంది అమ్మ. మూడవ ప్రపంచ యుద్ధానికి స్వస్తి పలికించింది అమ్మ. అందుకనే నేమో వరుణదేవుడు సునామీలు సృష్టిస్తున్నాడు. మీకిది ధర్మం కాదు వరుణదేవా ! మానవులను శిక్షించినా తల్లికి మీరు అపకారం చేసినట్లే. మీరు ఎవరిని బంధిస్తున్నారు. భూమి – అమ్మ. తల్లిని తనయుడు, ఓదార్చాలి. ‘పున్నామ నరకం నుండి రక్షించే వాడే పుత్రుడు’ సుమా – మీరు అది మరచినట్లున్నారు. తల్లికే హానిని తలపెడ్తున్నారు. భూలోకవాసులను ఆమె ఓదారుస్తుంటే మీరేమో పిచ్చుకపైబ్రహ్మాస్త్రం వేసినట్లుగా గజగజ వణికిస్తున్నారు. మాతృదేవో భవ అన్నది వేదం. తల్లిని మించిన దైవమే లేదని సినీగాయకులు ఆలపిస్తున్నారు. విఘ్నేశ్వరుడు తల్లియైన పార్వతీదేవి చుట్టు తిరిగే కదా పూజలకు ప్రధముడుగా ఎన్నిక అయ్యాడు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని రాష్ట్ర భక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు. తల్లికి బిడ్డ తప్పించి వేరే కనపడదని అమ్మ అనడం మీరు వినలేదా – అలాంటి తల్లికి తనయుడైన మీరు ఇలా కష్టపెట్టవచ్చునా. మీకు చెప్పగలిగేటంత జ్ఞానసంపద నాఎడల లేకపోవచ్చు ఇదొక భూలోక ధర్మంగా వివరిస్తున్నాను. ధర్మాన్ని ఆచరిస్తే అదే మనల్ని కాపాడుతుంది. వరుణదేవా ! దేవాది మహాదేవాకనికరించండి.
నేను నిత్యం 9 PM to 10 PM అఖండ నామార్చలనలో భాగంగా ఒక గంట-అమ్మనామం చేసేదాన్ని. ఆ రోజు కూడా అలాగే పూర్తి చేసుకొని పైకి అమ్మవద్దకు వచ్చేశాను. ఆరుబయట అమ్మ ఒక్కరే అటు తిరిగి పడుకొని వుంది. ఎవరూ లేరు కూడా – నేను వెనుకగా వున్నాను. రమా అని పల్కరించడం కాదు. పిలుపు విన్పించింది.
మరో పర్యాయం మా గోవాడ సంస్థానం నుండి బుట్టెడు చక్రాలు పిండివంట – చేయించుకొని 10 A.M. వచ్చాను. అక్కడ వున్న అడవులదీవి శ్రీరామమూర్తి అన్నయ్యగారు. ఇప్పుడే నమ్మా రమాదేవి వస్తుందని అమ్మ అన్నది అనడం. విశేషంగా విశేషమే. మరో శుభసమయం. ఎవరో అమ్మ దర్శనభాగ్యానికి వచ్చారు. అమ్మ స్నానానికి బయలుదేరడం – దినకర్ వస్తున్నాడమ్మా! అని అనడం – కొద్దిసేపటికీ అన్నయ్య రావడం అందరింటి పర్వానికి జరిగింది. ఇక్కడో విశేషంగా కట్టుబడి పోవడం – ఏమంటే ఎవరికి ఎవరు మరో ఎవరు ఎవరో తెలియని వారు వారెవరో వీరే ఎవరు – మరి వీరు ఎవరికి తెల్పుతారు? అమ్మెవరో ఎవరికి మరో ఎవరికి తెల్పనవసరం లేదని నా సలహా – తనెవరో ఏమిటో అమ్మవారే తెల్పుకుంటారు తనే ఎవరోనని. అందాక శెలవు. వుంటాను. రమా రాకేందు వదనా –
శ్రీరమా సత్యన్నారాయణస్వామివారు – స్వర్గంలో వున్న మా పితృదేవులు ఆనందంతో పులకరించి పోతున్నారు. అమ్మ యొక్క సౌభాగ్య సంపదకు పరవశించే ఆయన ఆత్మ అమ్మ ఒడిలోనే వుంది. అమ్మకు ఇవే నా ప్రణతులు-దీపావళీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అందరం బాగుండాలి.