విజయనగరం అమ్మ చరణ సేవాసమితి ఆధ్వర్యంలో 15-4-2022 సాయంత్రం 5.30 గంటల నుంచి 8.30 గంటల వరకు బుచ్చన్నకోనేరు తూర్పు గట్టున గల శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం నందు అమ్మ శతజయంతి ఉత్సవాలలో భాగంగా అమ్మకు శ్రీ లలితా సహస్ర నామములతో మరియు అంబికా అష్టోత్తరశతనామాళితో కుంకుమార్చన జరిగినది. ఇందులో కోనేరు నాలుగు రోజుల గట్టుల నుండి వచ్చిన 50 మంది మహిళలు పాల్గొన్నారు. పూజానంతరం 11 నిమిషాల పాటు అమ్మనామం 70 మందితో పలికించడం జరిగినది. పూజానంతరం అమ్మను గురించి జిల్లెళ్ళమూడి విశిష్టతను గూర్చి పూర్వ విద్యార్థులు మాట్లాడిన పిమ్మట పులిహోర ప్రసాదం మరియు విశ్వజననీ మాసపత్రికలు ఇవ్వడం జరిగింది. ఇందులో పూర్వ విద్యార్థులు టి. రమణ, జి. గోవిందరాజులు, కోల సూర్యనారాయణ మరియు జగన్నాధం దంపతులు పాల్గొన్నారు. ఉమామహేశ్వర ఆలయకమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలియచేయడం జరిగినది.
మల్లవరంలో అమ్మ శతజయంతి
మల్లవరంలో 05-04-2022 తేదీ మంగళవారం నాడు జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి సందర్భంగా ఎ.మల్లవరం గ్రామం నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమం అప్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్గారు, శ్రీ ఎమ్. సాయిబాబాగారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు, శ్రీ జి.మధుసూదన్ రావు జిల్లెళ్ళమూడి నుంచి వచ్చి, అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ష విజ్ఞానపరిషత్ అధ్యక్షులు శ్రీ వి. ధర్మసూరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎనిమిది భజన సమాజముల వారికి వస్త్రాలు సమర్పించారు. (బ్లౌజ్ & తుమాళ్ళు). మల్లవరం గ్రామంలోని 8 భజన సమాజాల వారు జిల్లెళ్ళమూడి అమ్మ నామాన్ని రాగయుక్తంగా ఆలపించడం చాలా సంతోషదాయకం. అమ్మ నామంతోపాటు హరేరామ సంకీర్తనను కూడ చేసారు. అనంతరం సుమారు 200 మందికి (జిల్లెళ్ళమూడి) అమ్మ అన్నప్రసాద వితరణ జరిగింది. దానిలో శ్రీ పోతాప్రగడ జానకీరాజా దంపతులు, అప్పారెడ్డి కుటుంబ సభ్యులు ఆనందంగా పాలుపంచుకున్నారు.