1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విజ్ఞప్తి

విజ్ఞప్తి

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : April
Issue Number : 9
Year : 2014

చిరకాలంగా అమ్మ ప్రసాదించిన దివ్యానుభూతులు తమ హృదయాల్లో పదిలపరచుకొన్న సోదరీ సోదరులు అనేకులున్నారు. వారిలో చాలామంది ఇప్పటికే అమ్మలో ఐక్యమయినారు. అమ్మతో మాట్లాడి అమ్మ వాత్సల్యజలథిలో తడిసి ఆ దివ్యచరణ సన్నిథిలో అనేక అనుభవాలను పొందిన సోదరీ సోదరులు ఇంకా అనేకులున్నారు. అలాంటి అక్కయ్య. అన్నయ్యల అనుభవాలను భావితరాలకై పదిల పరచాలనే సంకల్పంతో “అమ్మతో మా అనుభవాలు” అనే శీర్షికన సోదరుడు శ్రీ రావూరి ప్రసాద్ ద్వారా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వివిధ ప్రాంతాలలో 200 మంది పైగా సోదరీ సోదరుల అనుభవాలను రికార్డు చేయటం జరిగింది. ఇంకా చేయాల్సింది. చాలావుంది. పలుమార్లు ప్రయత్నించినా కారణాంతరాల వల్ల సాధ్యపడలేదు. ఇప్పటికి అమ్మ నిర్ణయం అంతవరకే అనుకుందాం. మిగిలినవార్ని చేయటం అనే ఈ కార్యక్రమానికి కామా పెట్టదలిచాం. ఇక ఈ ప్రాజెక్ట్ చేసినంతవరకు పూర్తిచేయాలనుకొన్నాం. అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చినవారికి, అవి కావాలనుకున్నవారికీ ఈ Interviews C.D’s అందుబాటులోకి తేవాలన్నా చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. ముందు కొన్ని వందల గంటల నిడివి కల ఈ Interviews ని EDIT చేయించాలి. అందుకు Professional studios’ వారితో సంప్రదించాం. షుమారు 4 లక్షల రూపాయల పై చిలుకుఖర్చు అవుతుందని వారు అంచనా వేశారు. ఇంతవరకు కొన్ని లక్షల వ్యయంతో ఈ కార్యక్రమం కొనసాగింది. స్వచ్ఛందంగా కొద్దిమంది సోదరుల ఆర్ధిక సహకారం మినహా, ఈ ప్రాజెక్టు కొరకు ఎవరి సహాయం కోరకుండా ఇంతవరకు అమ్మ నడిపించింది. ఇప్పుడు అందరికీ విజ్ఞప్తి చేస్తాం. తమ అనుభవాలు మాతో పంచుకొన్న సోదరీ సోదరులతో పాటు, అమ్మ బిడ్డలందరూ ఇతోధికంగా సహాయ సహకారాలందించి ఈ ప్రాజెక్టు పూర్తికాగలందులకై తమ వంతు స్నేహహస్తాన్ని అందించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. Cheque/D.D. ద్వారా పంపేవారు “Sri viswajanani Parishat” పేరే జిల్లెళ్ళమూడికి పంపుతూ “AMMA LIFE MUSEUM” కొరకు అని తెలియజేయగలరు.

గమనిక: ఎవరైతే అమ్మ అనుభవాలు మాతో పంచుకొన్నారో అమ్మతో వారు ఏసందర్భంలోనైనా తీయించుకొన్నా ఫోటోలు ఎన్ని వున్నా వెంటనే Scan చేయించి ravuri-prasad52@yahoo.com కానీ అలా చేయలేనివారు EDITOR విశ్వజనని Past Photocopies పేర పంపగలరు. Edit చేసేటప్పుడు అవి ఉపయోగపడతాయి.    శ్రీ విశ్వజననీపరిషత్ – జిల్లెళ్ళమూడి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!