1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను ప్రారంభించి స్వర్ణోత్సవ విశిష్ట సంచిక ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ దినకర్ వచ్చారు. శ్రీ విశ్వజననీ పరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు “విశ్వజనని” మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రసిద్ధ ఉపన్యాసకులు ఆచార్య శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి స్వర్ణోత్సవ సంయోజన చేశారు.
ఉపసభాపతి శ్రీ రఘుపతి బాల్యం నుండి అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించి సంస్కృతాంధ్ర భాషల అభివృద్ధి జాతికి మేలు చేస్తుందని చెప్పారు. సంస్కృతికళాశాల అభివృద్ధికి కృషిచేసిన శ్రీ బొప్పూడి రామబ్రహ్మగారికి “జీవిత సాఫల్యా సేవా పురస్కారం” అందించి సత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తి నవభారత బాంక్ చైర్మన్ శ్రీ పాండురంగారావు శ్రీరామబ్రహ్మంగారిని గూర్చి ప్రసంగించారు. శ్రీదేశిరాజు కామరాజు గారు సభకు ఆహ్వానం పలికారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభా నిర్వహణ చేశారు.
మధ్యాహ్నం జరిగిన సభలో శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు సంస్కృతం ఈ జాతి జీవనాడి అంటూ చిన్నప్పటి తన అనుభవాలు అమ్మను చూడాలని జిల్లెళ్ళమూడిని దర్శించాలనే తన కోరిక ఈ రకంగా నెరవేరటం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ లక్కరాజు సత్యనారాయణ అమ్మతో తన అనుబంధాన్ని వివరించారు. పూర్వవిద్యార్థి సమితి విశ్వజననీ పరిషత్ కార్యవర్గసభ్యులను సత్కరించారు. పూర్వవిద్యార్థి శ్రీ యస్.యల్.వి.ఉమామహేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సాయంత్రం సామూహిక లలితాసహస్ర నామ పారాయణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడినవి.
11.12.2021 ఉదయం కళాశాల ప్రాంగణంలో “అంత నామకోటిస్థూప” ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థూపాన్ని యానాది రాముడు ఆవిష్కరించగా శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం వంటి పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. స్థూపానికి ధనదాతలుగా ఉన్న శ్రీ శిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారు వారి కుటుంబం విచ్చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయశర్మగారు తాము కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు అమ్మతో అనుబంధాలు, విద్యార్థుల దీక్షాదక్షతులు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ప్రసంగించారు.
ఉదయం జరిగిన సభాకార్యక్రమానికి గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీస్వామి. వారు ఈ జాతి వైభవానికి ఆలయాలు- సంస్కృత భాషాబోధన ఏలా మూలకందలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి సంస్కృతాంధ్రభాషల విశిష్టత దానికి ప్రజలు ప్రభుత్వము చేయవలసిన కృషి వివరించారు. అకాడమీ పాలకమండలి సభ్యులు శ్రీ కప్పగంతు రామకృష్ణ తన విద్యాభ్యాసం నాటి విశేషాలు సంస్కృత కళాశాలల సాధన బోధనలు వివరించారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్ధి శ్రీ యం. జగన్నాధం రాగా సభానిర్వహణ పూర్వవిద్యార్ధి శ్రీ గంటేడు చిన్నంనాయుడు సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీ యం. నాగరాజు పూర్వవిద్యార్థి వందన సమర్పణ చేశారు. కళాశాల పూర్వ ప్రస్తుత గురువులను పూర్వవిద్యార్ధి సమితి సత్కరించింది. వారు సందేశాలిచ్చారు ఉచిత రీతిలో,
11.12.2021 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఛీఫ్ సెక్రటరీ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యంగారు. వచ్చి అమ్మతో అనుభవాలు చెప్పి కళాశాలకు తన చేతనైన సాయంచేయటానికి ఎప్పుడూ సిద్ధమే నన్నారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్థిని శ్రీమతి పి.వి. రామశర్మ ముఖ్యఅతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యాయ యం.యల్.సి. శ్రీమతి టి. కల్పలత వచ్చారు. సభానిర్వహణ డాక్టర్ వై.నాగేంద్రమ్మ చేయగా, ఆహ్వానం కుమారి ఎ.మనీషా, వందన సమర్పణ శ్రీ పి.సత్యనారాయణ చేశారు. విద్యార్థులచే అమ్మ నామ సంకీర్తన – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప బడ్డాయి.
12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన ప్రసంగించారు. శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు సభా నిర్వహణ చేశారు. శ్రీ గోలి రామచంద్రరావు ఆహ్వానం పలుకగా డాక్టర్. బి.శ్యామల వందన సమర్పణ చేశారు.
12.12.2021 సాయంత్రం ముగింపు సమావేశానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణ అధ్యక్షత వహించారు. గౌరవ అతిధి ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అమ్మ తనకు. ఏలా విద్యగనిపి పైకి తెచ్చింది చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరప్రసాదమూర్తి ప్రసంగించారు. శ్రీ ఆర్.వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. శ్రీ బౌరోతు శంకరరావు ఆహ్వానం పలుకగా శ్రీ ఐ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి వందన సమర్పణ చేశారు.
అందరింటి సభ్యులందరినీ పూర్వవిద్యార్థుల సమితి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ స్వర్ణోత్సవ వైభవం జిల్లెళ్ళమూడి అందరింటి విశిష్టతకు తగ్గట్టుగా అందరి మన్ననలు అందుకుంది.