1. Home
  2. Articles
  3. Viswajanani
  4. (విద్యాలయ విశేషాలు) మాతృ సంస్థను మరువలేము

(విద్యాలయ విశేషాలు) మాతృ సంస్థను మరువలేము

Mallapragada Srimanarayana Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : April
Issue Number : 9
Year : 2010

ఫిబ్రవరి 23వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల బి.ఏ. ఫైనల్ విద్యార్థులు వీడ్కోలు సమావేశం అనుభూతిప్రదంగా జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.యస్.ఆర్.ప్రసాదరావు గారు సభకు అధ్యక్షత వహించారు. విద్యార్థులు విద్యలో విశేషమైన కృషిచేసి, ఉత్తీర్ణులు కావాలని, మంచి పౌరులుగా రాణించాలని, అమ్మ సంస్థతో ఏర్పడిన అనుబంధం శాశ్వతంగా కావాలని విద్యార్థులను శ్రీ ప్రసాదరావుగారు ఆశీర్వదించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కని సూచనలు చేశారు.

విద్యార్థులు తమ ప్రసంగాల్లో అమ్మ సన్నిధిలో విద్యాభ్యాస కాలంలో తాము పొందిన అనుభూతులను అధ్యాపకులకు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ పట్ల, అందరింటిపట్ల ఆత్మీయతను ప్రకటించారు. సంవత్సరంలో ఒక రోజు అన్నపూర్ణాలయంలో వివరించారు. ” అమ్మ ప్రసాదాన్ని భోజనంగా పంచే కార్యభారాన్ని స్వీకరిస్తామన్నారు. అమ్మను, సంస్థను మరచిపోలేమని, ఈ విద్యాసంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని నిండుమనస్సుతో అందించగలమని ప్రకటించారు. 

బహుమతి ప్రదానోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, మాతృశ్రీ సంస్కృత పాఠశాల విద్యార్థులకు ఫిబ్రవరి 17, 24వ తేదీల్లో బహుమతి ప్రదానం జరిగింది.

శ్రీ కొండముది రామకృష్ణ ఫౌండేషన్ పక్షాన సంపూర్ణ విద్యార్థి’ అవార్డులను ఫౌండేషన్ సభ్యులు శ్రీ కొండముది సుబ్బారావు గారు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావు గారు అందజేశారు. విద్య, ప్రవర్తన, సేవాతత్పరత అనే మూడు అంశాలు ప్రమాణంగా స్వీకరించి, ఈ అవార్డులను అందించారు. కళాశాల బి.ఏ. ఫైనల్ విద్యార్థిని కుమారి మాధురి, పాఠశాల 10వ తరగతి విద్యార్థి చి॥ఆర్.బాజీవలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. శ్రీ రామకృష్ణ పౌండేషన్ తరపున ఒక్కొక్కరికి రూ. 558/- నగదు బహుమతులను, షీల్డులను బహుకరించారు. అమ్మ, నాన్నగార్ల ధాన్యాభిషేక మహోత్సవ సభలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది.

ఆ తరువాత 24వ తేదీన జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ రంగాల్లో బహుమతులు అందించారు. శ్రీవిశ్వజననీ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు బహుమతులు పంచి, విద్యార్థులను ఆశీర్వదించారు.

విద్యార్థులు అన్నిరంగాలలోనూ పురోగమించాలని, అమ్మ ఆశీస్సులు, సంస్థనుంచి అండదండలు ఎప్పుడూ ఉంటాయని శ్రీ లక్ష్మణరావు గారు ప్రకటించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో కంప్యూటర్ శిక్షణను ప్రారంభిస్తున్నామని, వదాన్యులైన దాతల సహకారంతో ఈ కార్యక్రమ ప్రణాళిక రూపుదిద్దుకుంటోందని శ్రీ లక్ష్మణరావు వివరించారు. 

సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారు విద్యార్థులను అభినందిస్తూ, అమ్మ ప్రసాదిస్తున్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థులు అభ్యుదయం సాధించాలని ప్రబోధించారు.

ఈ సందర్భంగా మాతృశ్రీ విద్యాపరిషత్ కరస్పాండెంట్ శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావుగారి సౌజన్యంతో విద్యారంగంలో కళాశాల, పాఠశాలల్లోని ప్రతి తరగతిలోనూ ప్రథమ, ద్వితీయ శ్రేణి విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. సుమారు రూ.2,500/- ఖరీదయిన సాహిత్య, పాఠ్యగ్రంథాలను విద్యార్థులకు బహుకరించారు.

క్రీడారంగంలో విశిష్టస్థాయిలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు, కప్పులు, షీల్డులు బహుకరించారు. శ్రీ విశ్వజననీపరిషత్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు రూ.5,000/- ఈ బహుమతుల నిమిత్తం కళాశాలకు బహూకరించారు. గేమ్స్ & స్పోర్ట్స్ కన్వీనర్ శ్రీ టి. మురళీధర రావు గారు ఈ కార్యక్రమాన్ని ఉల్లాసభరితంగా నిర్వహించారు. ఆటల పోటీల నిర్వహణలో తనకు సహకరించిన విద్యార్థినుల వార్డెన్ శ్రీమతి నాగమణిగారికి, కళాశాల అధ్యాపకులు శ్రీమతి మృదుల, శ్రీ ఫణిరామలింగేశ్వర శర్మ, శ్రీ రాంబాబు గార్లకు శ్రీ మురళీధరరావు గారు కృతజ్ఞతలు తెలిపారు.

భక్తి, దేశభక్తి ఆధారంగా లలిత గీతాలు ఆలపించి, గెలుపొందిన విద్యార్థులకు ఈ వేదికపై బహుమతులు అందించారు. కళాశాల మాజీ కరస్పాండెంట్ శ్రీ ఎం. ఎస్. శరచ్చంద్ర కుమార్ గారి ప్రేరణతో, వారి ప్రణాళికకు అనుగుణంగా ఈ లలిత సంగీతం పోటీలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ప్రేమకుమార్ గారు ఈ పోటీలను నిర్వహించారు. కళాశాల సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ టి.వి. సోమయాజులు గారు, తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ బి.యల్. సుగుణ గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, విద్యార్థులను ఎంపిక చేశారు. సంస్కృతం రీడర్ డాక్టర్ పి. ఝాన్సీలక్ష్మీ బాయి గారు ఈ బహుమతుల నిమిత్తం రూ.600/- విరాళంగా అందించి సహకరించారు.

ఇటీవల ‘ఇస్కాన్’ అంతర్జాతీయ సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ శాస్త్రిగారు యోగ్యతా పత్రాలను బహుకరించారు. ఈ పోటీలో రాష్ట్రస్థాయి ద్వితీయబహుమతి విజేత చిరంజీవి ఐ. పవన్కుమార్ మార్చి 4వ తేదీన చేశారు. రాజమండ్రిలో ఈ బహుమతిని అందుకుంటాడని ప్రిన్సిపాల్ ప్రకటించారు.

భగవద్గీత పోటీలకు తమకు ఉత్సాహ ప్రోత్సాహాలు అందించిన అధ్యాపకురాలు శ్రీమతి ఎల్. మృదులగారికి,

చక్కని మార్గదర్శకత్వాన్ని అందించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రిగారికి విజేతలు, పోటీచేసిన అభ్యర్థులు తమ ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ భవాని, హరిదంపతులు, శ్రీ పట్టమట్ట నరసింహమూర్తిగారు, శ్రీ వల్లూరి పార్థసారధిగారు విద్యార్థులను ప్రోత్సహిస్తూ, శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన బహుమతులను శ్రీ లక్ష్మణరావు గారు విద్యార్థులకు అందజేశారు.

పాఠశాల స్థాయిలో శ్రీ కోపల్లె శ్రీరామమూర్తిగారి పేరిట అందించే రజత పతకం, కళాశాల స్థాయిలో డాక్టర్ నండూరి గోవిందరావు గారు అందించే రజత పతకాలను త్వరలో అందించగలమని ప్రిన్సిపాల్ డాక్టర్ శాస్త్రిగారు ప్రకటించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, విరాళాలు అందిస్తున్న దాతలకు ప్రిన్సిపాల్ డాక్టర్ శాస్త్రిగారు కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్ర పాఠ్యాంశాల్లో అధికశాతం మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ హిస్టరీ లెక్టరర్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, ఇంగ్లీషులో అత్యున్నత స్థానంలో నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ బి.శాంతారాంగారు అందించే బహుమతులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యన్.సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రిగారు విద్యార్థులకు ప్రదానం చేసారు. 

విద్యా, క్రీడా, సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులు అమ్మ అనుగ్రహంతో మరింత పురోగతిని సాధించాలని అందరం కోరుకుందాం.

భావానికి రూపం ఉంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!