శ్రీ వఝా హేమకుమార్ లోగడ ‘అమ్మ’పై సుమధుర గీతాల్ని రచించి, వాటిని శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి సుప్రసిద్ధ గాయనీ, గాయకులచే పాడించి, సి.డి.ని రూపొందించి ఒక పూజా పుష్పంగా సమర్పించారు.
నేడు శ్రీ వేంకటాచలపతిపై ‘ఇలను వైకుంఠమనగా’, ‘అమ్మ ఎంత దయామయివే వంటి భక్తిగీతాలను రచించారు. వాటిని శ్రీ కారుణ్య, శ్రీకౌశిక్, శ్రీమతి నిత్యసంతోషిణి మృధుమధురంగా గానం చేయగా, ఆల్బంను రూపొందించారు.
25-12-2019న హైదరాబాద్లో త్యాగరాజ గాన సభలో ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారి అధ్యక్షతన జరిగిన సభలో ఆ సి.డి. ని ఆవిష్కరించారు.
టి.టి.డి. బోర్డ్ అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డిగారు, శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ఎస్. వేణుగోపాలాచారి, శ్రీ ఎన్. రామచంద్రరావు, శ్రీ వై.వి.ఎస్.టి. శాయి, ప్రభృతులు వేదిక నలంకరించి రచయిత శ్రీ హేమకుమార్ కృషిని అభినందించారు.
అందరికీ శ్రీనివాస ప్రసాదం తిరుపతి లడ్డు, పాటల సి.డి.తో పాటు ఆదరణగా అల్పాహారాన్నందించారు.
వేద ఆశీర్వచనం, వందన సమర్పణతో సభ ముగిసింది.