గుంటూరులో శ్రీ టి.టి.అప్పారావు గారి అమ్మ చింతన
మాతృశ్రీ అధ్యయన పరిషత్ కార్యదర్శి విశ్వజననీపరిషత్, గుంటూరు కార్యవర్గ సభ్యుడు శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావుగారింట్లో 24.11.11న శ్రీ తూనుగుంట్ల త్రిలోక అప్పారావుగారు అమ్మ తత్వచింతన సదస్సులలో భాగంగా అమ్మ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందీ, ఎలా ధ్యానమార్గంలో తీర్చిదిద్దింది. ఎలా అనుభూతులు ప్రసాదించింది సోదాహరణంగా వివరించారు. సభకు అమ్మ భక్తులు 25 మంది దాకా వచ్చారు. ఆసభలో చివరలో విశ్వజనని మాసపత్రిక సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాదారు అమ్మను గూర్చి శ్రీ టి.టి. అప్పారావు గారిని గూర్చి ప్రసంగించటంతో సంతోషించారు.