1. Home
  2. Articles
  3. Mother of All
  4. వివేకము – వైరాగ్యము Discrimination – Dispassion

వివేకము – వైరాగ్యము Discrimination – Dispassion

B.G.K Sastry
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : October
Issue Number : 4
Year : 2016

వివేకము అంటే ఏమిటి?

ఆత్మ నిత్యము. ఆత్మ భిన్న సమస్తము అనిత్యము అనెడి నిశ్చయమే వివేకము. నిత్యవస్తు ఏకం బ్రహ్మ – తత వ్యతిరిక్తం సర్వం అనిత్యం.

దేశకాల అపరిచ్ఛిన్నుడు బ్రహ్మ. మిగిలినదంతా దేశకాలాలలో వచ్చి పోతూ వుంటుంది. జగత్తంతా దేశము, కాలము అనే చట్రంలో బిగించబడి వుంది అని తెలుస్తుంది.

The discriminative knowledge between the timeless and timebound is VIVEKA.

సమస్త జగత్తు అశాశ్వతం, క్షణభంగురం. ఇదే జగత్తు యొక్క స్వాభావిక ధర్మం. జగత్తులోని వస్తువులన్నీ పారుతున్న నదిలో పచ్చికుండలు లాంటివి. కనుక జగత్తులోని వస్తువులు శాంతి, ఆనందము ఇవ్వలేవు, అని తెలుసుకోవటం వివేకం.

అలా అని జగత్తులోని వస్తువులు వదలి వేయకూడదు. జగత్తు can give you entertainment. సంగీతం, సాహిత్యం, It can educate you. ఎవరి దగ్గర ఏమి అడగాలో తెలియటం వివేకం. జగత్తుని – బ్రహ్మానందం అడగకూడదు. ఇవ్వలేదు. నిత్యవస్తువు, బ్రహ్మము, దేవుడు alone can give me permanent security అని తెలియాలి. అదే నిత్యా నిత్య వస్తు వివేకం.

కనుక మొట్టమొదట ఇలాంటి విచక్షణా సహిత పరిశీలన ద్వారా మనకు అర్థమౌతుంది. జనన మరణాలులేని ఒక నిత్య వస్తువు వున్నదని, దానిని ‘సత్’ అనండి, ఆత్మ అనండి, బ్రహ్మ మనండి, Truth అనండి, మిగిలినదంతా అనిత్యమని.

ఈ వివేకం కలగటం slow process. జీవితంలో చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుంటూ, క్రొత్త కోరికలు కోరుకుంటూ, కొన్ని తీరి, చాలా తీరక, మనసులో ఎప్పుడూ ఏదో వెలితి, అశాంతి. ఇంకా ఏదో కావాలి. Requirement gap వుంటూనే వుంటోంది కదా! మరి solution ఏమిటి?

ఈ ప్రయత్నంలో పుస్తకాలు చదవటం, సత్సంగ్లకు వెళ్ళటం, అక్కడ పెద్దల మాటలు వింటూ వుంటే తెలుస్తుంది. The treasure we are looking for is within us. నీవే. తత్త్వం అసి అని. పుడ్తూ, పోతూ వుండే బయటి ప్రపంచంలో లేనే లేదని. మనము నిత్య సుఖం, ఎల్లపుడూ వుండే ఆనందం కోరుకుంటున్నాం. అది జగత్తు ఇవ్వలేదు. Eternal happiness, lasting support కోసం నిత్యవస్తువు మీద ఆధారపడాలి. అంటే నిత్య వస్తువుని కోరుకుంటున్నాం. అదే బ్రహ్మ. అదే నీవు. నేను. ఇప్పుడు విచారణ ప్రారంభం. ఇన్నాళ్ళూ అనుభవించిన సుఖాలు తృప్తినివ్వలేదని, గోరంత సుఖం కొండంత దుఃఖం మిగిల్చిందని, అనిత్యం అసుఖం లోకం దుఃఖాలయం అశాశ్వతం అని తెలుస్తుంది. విషయాల వెనక, పరుగులు పెట్టటం తగ్గిపోతుంది. ఈ వివేకంలోంచి వైరాగ్యం పుడుతుంది.

వైరాగ్యం :- విగతరాగ: విరాగ:, విరాగ స్వభావ: వైరాగ్య.. విషయాసక్తి రాగం. విషయ అనాసక్తి విరాగం.

వైరాగ్యం అంటే ఇహలోకంలోని, పరలోకంలోని భోగాలపై ఆసక్తి లేకుండ. The absence of desire for the enjoyment of the fruits of one’s actions in this world as also పరలోక. జగత్తు ఆనందకారకం అనుకున్నంత వరకు passionateగా వుంటాడు. వైరాగ్యం వివేకం నించి రావాలి గాని disappointments నించి కాదు. జ్ఞానం కోసం వైరాగ్యం రావాలి. జగత్తు మీద eternal కోసం ఆధారపడక పోవటం వైరాగ్యం. Eternal happiness, eternal support కోసం నిత్య వస్తువు (God) మీద ఆధార పడాలి.

ప్రపంచం మీద వైరాగ్యం పుడితే, ఆ వైరాగ్యం, ముముక్షుత్వం వైపు నిన్ను నెళ్తే, అది correct వైరాగ్యం.

వైరాగ్యం, విరాగం అంటే ప్రేమ లేకుండ వుండటం కాదు. మామూలుగా, మనప్రేమ, కొన్ని పరిస్థితులకో, కొంత మంది బంధువులకో స్నేహితులకో, వస్తువులకో, పరిమితమౌతుంది. ఎందుకని? అలా చేయటం వలన మనకు సంతోషం, హాయి, భద్రత, అనుకుంటాము. అంటే దీని అర్థం మన ప్రేమ మనకు పూర్ణమైన ఆనందం కొరకు, పూర్ణమైన భద్రత కొరకు అని తెలుస్తుంది. అంటే మనం అనిత్య వస్తు అన్వేషణలో వున్నామన్న మాట.

అనిత్య వస్తువే దేవుడు అని తెలుసుకొని, మన focus, attention ప్రేమ దేవుని మీద పెడ్తున్నాము. ఆ దేవుడే ‘నాలో వున్న నేను’ నాలో వున్న ఆత్మ అనే యధార్థం అర్థం చేసుకుంటే, మన ప్రేమ, focus మనలోనే వున్న ఆత్మ, ఆ జ్ఞానం మీదకే ప్రవహిస్తుంది.

కనుక వైరాగ్యం అంటే ‘నిత్య వస్తువు మీద ప్రేమ’, ఆ ప్రేమ కూడ ఆత్మ జ్ఞానం మీద ప్రేమ వైపుకే తీసుకెళ్తుంది.

దేవుడు పూర్ణుడు. నిత్యవస్తువు. మన జీవిత గమ్యం అదే. ఆ దేవుడే నాలో ఆత్మ స్వరూపంగా వున్నాడు. అదే నా నిజస్వరూపం. అన్నపుడు, ఆ, నా, నిజస్వరూప జ్ఞానం మీద ప్రేమే వైరాగ్యం.

పుట్టపర్తి సత్యసాయిబాబా అన్నారు. “నా Teachings అర్థం చేసుకొని, follow అవటం. దాన్నిమించిన వివేకం లేనేలేదు. అదే పెద్ద వివేకం.

“కళత్ర, పుత్ర, మిత్ర, పశు, భృత్యాదులు ఒకే స్థలం నించి రాలేదు. ఒకేసారి పోయేవారూ కాదు, మరణానంతరమున ఒకే చోటకు చేరే వారూకాదు అని ధృఢముగా తెలుసుకుంటే వారిపై రాగము విరాగములోనికి

జారుకుంటుంది.”

విరాగస్వభావమే వైరాగ్యం.

జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు. “సర్వత్రా అనురాగమే విరాగం. విరాగమంటే మమకారాలను త్రుంచి వేసుకోవడం కాదు. పెంచుకోవడం. మమకార పరిథిని, విస్తృతపరిచి, సర్వజగత్తుకూ పరివ్యాప్తం చేయడం.”

వివేకం, వైరాగ్యం ఎట్లా వస్తాయి?

By following ధర్మానుష్ఠానం, నిష్కామకర్మ, కర్మఫలత్యాగం ద్వారా వస్తాయి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!