1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విశాఖలో అమ్మ అనంతోత్సవాలు

విశాఖలో అమ్మ అనంతోత్సవాలు

Various Authors
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 12
Year : 2022

అమ్మ అనంతోత్సవాలలో భాగంగా విశాఖ అమ్మ మందిరంలో 12-6-2023 న ఉదయం గం.11 నుండి 12:30 గంటల వరకు అమ్మకు 11 ఆవృతుల శ్రీసూక్త పారాయణతో అన్నాభిషేకం జరిగినది. తదుపరి త్రిశతి, ఖడ్గమాల, అంబికా అష్టోత్తరశతనామాళితో అమ్మకు పూజ చేసి నివేదనానంతరం అమ్మ ప్రసాద వితరణ జరిగినది సుమారు 60 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృశ్రీ అధ్యయన పరిషత్ విశాఖపట్నం సభ్యులు, జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థులేకాక కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామ సమీపంలో గల కైవల్యాశ్రమ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ విద్యాసాగర్ స్వామివారి సూచనతో విశాఖలో గల వారి శిష్యులు 8 మంది మరియు చీరాల వాస్తవ్యులు చిన్నతనంలో అమ్మచే అన్నప్రాశన చేయించుకున్న గోపి గారు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!