1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విశాఖలో అమ్మ తత్వచింతన సదస్సు

విశాఖలో అమ్మ తత్వచింతన సదస్సు

p Krishna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 12
Year : 2012

జగన్మాత, వాత్సల్యామృతవర్షిణి “అమ్మ” 90వ జన్మదినోత్సవ సందర్భంగా మాతృశ్రీ అధ్యయన పరిషత్ విశాఖపట్నం మరియు మాతృశ్రీ సంస్కృతకళాశాల పూర్వ విద్యార్థులు సంయుక్త నిర్వహణలో విశాఖ శ్రీ లలితా వీరంలో జూన్ 9 మరియు 10వ తేదీలలో “అమ్మ తత్వచింతన సదస్సు” జరిగినది. ఈ సదస్సుకు అమ్మ భక్తులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థులు హాజరై అమ్మప్రేమను అనురాగాన్ని పునస్మరణ చేసుకుంటూ “అమ్మతత్త్వం” గురించి తెలుసుకోగలిగారు.

9-6-2012 ఉదయం కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామి వారు సదస్సును ప్రారంభించారు.

పూర్వవిద్యార్థి గంటేడ చిన్నం నాయుడు ఆహ్వానం పలికారు. మాతృశ్రీ అధ్యయన పరిషత్ (విశాఖ) అధ్యక్షులు శ్రీమతి కుసుమాచక్రవర్తిగారు సభాధ్యక్షత వహించగా, జిల్లెళ్ళమూడి శ్రీ విశ్వజననీపరిషత్ సంఘటనా కార్యదర్శి శ్రీ యస్.మోహనకృష్ణగారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. విశాఖపట్నం శ్రీ లలితాపీఠం మేనేజరు శ్రీ వాడ్రేవు సుబ్బారావుగారు సదస్సును శుభాకాంక్షలు తెలియచేసారు. జిల్లెళ్ళమూడి విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ వారణాసి ధర్మసూరిగారు అమ్మ నామ ప్రాశస్త్యం గురించి చేశారు. వివరించారు.

జిల్లెళ్ళమూడి ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు పి. మధుసూదనరావు, గంటేడ చిన్నంనాయుడు, పి.అప్పారెడ్డి. ఎ. హరిబాబు జిల్లెళ్ళమూడిలో అమ్మతో పొందిన అనుభూతులు తెలియజేశారు. విశ్వజననీ మానవత్రిక సంపాదకులు శ్రీ పి.యన్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు సభను నిర్వహించారు. కళాశాల పూర్వవిద్యార్థి పొట్నూరు కృష్ణ వందన సమర్పణ చేశారు.

మధ్యాహ్నం “పూర్వ విద్యార్థుల ఆలోచనలు ప్రణాళికలు” అనే అంశంపై చర్చాగోష్ఠి ప్రారంభమైనది. పూర్వ విద్యార్థి పి.అప్పారెడ్డి ఆహ్వానం పలికారు. సభకు మాతృశ్రీ విద్యాపరిషత్ అభివృద్ధి సంఘాధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జిల్లెళ్ళమూడిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివరించి, భవిష్యత్ ప్రణాళికలు గురించి తెలియజేశారు. పూర్వవిద్యార్థుల సహకారం కోరారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావలెనని పిలుపునిచ్చారు.

శ్రీ విశ్వజననీపరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లెళ్ళమూడిలో రోజూ జరుగుచున్న కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.

పూర్వ విద్యార్థులు యస్. రామచంద్రరావు, శ్రీమతి కస్తూరి, పి.సత్యనారాయణ, ఎన్.మురళీకృష్ణ, కె. సూర్యనారాయణ మూర్తి తదితరులు అమ్మ ప్రేమ గురించి, తమ అనుభవాలు గురించి ప్రసంగించారు.

సాయంత్రం ఆచార్య ఎ. ప్రసన్నకుమార్ గారు అధ్యక్షత వహించారు. ఛీప్ ఇంజనీర్ శ్రీ టి. లక్ష్మీపతిగారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు అమ్మ ప్రేమతత్త్వం మరియు ఉపనిషస్పూర్తి అమ్మ” అనే అంశము గురించి ఉపన్యసించారు. డా. యు.వరలక్ష్మి గారు రిటైర్డు తెలుగు రీడర్, ఆర్ట్ & సైన్సు కళాశాల, బాపట్లగారు, సభానిర్వహణ చేసారు. 

పూర్వ విద్యార్థులు ఎ. ప్రభాకర్, వి.కృష్ణ. వి.వి.వి. శర్మ, ఎ.యస్.వరప్రసాద్, ఎ.వి.యస్.ప్రకాశరావు తదితరుల అమ్మ గురించి, జిల్లెళ్లమూడి అనుభవాలు గురించి మాట్లాడారు శ్రీ రావూరి ప్రసాద్ గారు అమ్మపై ఆలపించిన గీతాలు ముగ్గులను చేసాయి.

10-6-2012 ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమైనది. పోట్నూరు కృష్ణ ఆహ్వానం పలుకగా, విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ చాగంటి శరభలింగం గారు అధ్యక్షత వహించారు. శ్రీ ఎమ్.వి.ఆర్. శర్మ దర్శనం మాసపత్రిక సంపాదకులు హైదరాబాదు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి అమ్మ గురించి వారి అనుభవాలను వివరించారు. విశాఖపట్నం సోదరి శ్రీమతి జి. సరళగారు అమ్మ సన్నిధిలో పొందిన అనుభూతులు వివరించారు. శ్రీమతి డా॥యు.వరలక్ష్మిగారు ఆదర్శవంతమైన అమ్మ వ్యక్తిత్వం మనందరికి ఆదర్శ ప్రాయమని తెలియజేశారు.

పూర్వ విద్యార్థులైన బౌరోతు శంకరరావు, వి. రమణమూర్తి ఉపన్యసించారు. అమ్మ వ్యక్తి కాదు మహాశక్తి అని, అమ్మ వద్ద పొందిన ప్రేమ ఎక్కడ లభించదని అక్కడ గాలి, నీరు, జీవులు, అన్నీ అమ్మ ప్రేమను పొంది పవిత్రత పొందాయని అన్నారు.

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల చరిత్రోపన్యాసకులు శ్రీ మల్లాప్రగడ శ్రీ మన్నారాయణ మూర్తి గారు సభను నిర్వహించారు. అమ్మ తత్త్వం అనే అంశం గురించి తెలుపుతూ చిన్ననాటి నుండే అమ్మ చేసిన పనులు, అమ్మ చూపించిన వాత్సల్యం ఆమె తత్త్వానికి మచ్చుతునకలనీ ఉదాహరణతో సవివరంగా వివరించారు. ఆధ్యాత్మికపరంగాను, ఆలోచనపరంగాను సాగిన వీరి ఉపన్యాసం ఆద్యంతం రసరమ్యముగాను, ఆహ్లాదముగాను సాగినది.

అమ్మ సన్నిధిలో ఉన్న ఆ కళాశాల సంస్కారము నకు మానవత్వానికి, సహకారమునకు, భక్తికి పెట్టినిల్లు. అక్కడ విద్యనభ్యసించడం పూర్వజన్మ సుకృతం. ఆ కళాశాలలో ఆచార్యులను దర్శించుకున్న పూర్వవిద్యార్థులు ఆనందానికి అంతేలేదు. ఉత్తమోత్తమ గురువులైన శ్రీ మలాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, శ్రీమతి యు.వరలక్ష్మి గార్ని సత్కరించడం ఒక అపూర్వ అవకాశంగా భావించి పూర్వవిద్యార్థులు వీరిని సత్కరించి వారి ఆశీస్సులు నిర్వహించారు. పొందారు.

పూర్వవిద్యార్థి మజ్జా సత్యం ఆహ్వానం పలుకగా జిల్లెళ్ళమూడి శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఇచ్చారు. ఎమ్. దినకర్ గారు అధ్యక్షత వహించారు. శ్రీ ఎమ్. యస్. శరత్ చంద్రకుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి Power point presentation చేసారు. పూర్వ విద్యార్థులైన ఎమ్, జగన్నాధం, బి. తిరుపతిరావు, మజ్జ సత్యం, డి.సూర్యనారాయణ, టి. హైమవతి ప్రసంగించారు.

పూర్వ విద్యార్థులందరూ తమకు బ్రతుకునిచ్చిన విద్యాసంస్థలకు అన్ని విధాలా సహకరించాలని ఈ క్రింది తీర్మాణాలు చేసుకున్నట్లు పొట్నూరు కృష్ణ తెలియజేసారు.

1) ప్రతి విద్యార్థి సంవత్సరానికి రూ.1000/ పంపించాలి. 2) విశాఖ, పార్వతీపురం, పాలకాండలలో త్వరలో సమావేశాలు ఏర్పాటు చేయాలి. 3) విశ్వజననీ పరిషత్ వారి నుండి అనుమతితో చందాలు సేకరించి పంపాలి. 4) కనీసం సంవత్సరమునకు ఒక పర్యాయమైనా జిల్లెళ్ళమూడి వెళ్ళాలి.

పై తీర్మానాలను సభాముఖంగా అందరికి తెలియ తెలియజేసారు.

ఈ కార్యక్రమములలో పాల్గొన్న అందరికి, మరియు సదస్సుకు విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికి సన్మానం చేసి తమ ఔదార్యం చాటుకున్నారు. మాతృశ్రీ అధ్యయనపరిషత్ విశాఖపట్నం వారు.

సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సభకు విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎన్. శ్రీనివాసరావు .. గారు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా శ్రీ విజయభాను గారు మరియు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ చరిత్రాపన్యాసకులు శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు పాల్గొన్నారు. “విశ్వజననీ” మాసపత్రిక సంపాదకులు మరియు గుంటూరు శ్రీనాధపీఠం సంచాలకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు సభను చక్కగా

విశాఖపట్నం శ్రీ లలితాపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారు సమారోపన సందేశాన్ని ఇచ్చారు. 

ఈ రెండు దినాలు “అమ్మతత్త్వచింతన సదస్సు” ఎంతో ఆనందంగాను, ఆధ్యాత్మికతను పంచుతూ ఆలోచనాపరంగా పరిషత్ అభివృద్ధికి మార్గదర్శనం చేస్తూ సాగటం సంతోషాన్ని కలిగించింది. ఇతర ప్రాంతాలవారికి స్ఫూర్తిని కలిగించింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!