విశాఖపట్నం అమ్మమందిరంలో 19-8-2024వ తేదీన ఆత్మీయసమావేశం జరిగింది. జిల్లెళ్ళమూడి శ్రీవిశ్వజననీపరిషత్ అధ్యక్షులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్. ఆర్. మూర్తిగారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ తత్త్వ చింతన విశేషాలను వివరించారు. ఈ సమావేశం శ్రీ శరచ్చంద్రగారి చొరవతో జరిగింది. శ్రీమతి కుసుమక్కయ్య గారు, శ్రీమతి & శ్రీ కవిరాయని కామేశ్వరరావు గారు, శ్రీమతి & శ్రీ అశ్వనీకుమార్ (డాక్టర్) గారు, శ్రీమతి & శ్రీరామరాజుగారు, శ్రీమతి & శ్రీ మురళి దంపతులు, శ్రీ గంటేడ చిన్నంనాయుడు, విశాఖపట్నం అమ్మ కుటుంబం నుండి శ్రీ సీతారామారావుగారు, మూడడ్ల ఉమామహేశ్వరరావుగారు, కేదారశెట్టి ఆదినారాయణగారు, అంపోలు మురళి, శ్రీమతి సరస్వతి దంపతులు, పార్వతి, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు, ఎందరో సోదరీ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయ. సమావేశాన్ని రక్తికట్టించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కవిరాయని కామేశ్వరరావు గారు అమూల్యమైన అనుభవాలు అందించారు.
డాక్టర్ అశ్వనీకుమార్ గారు, కుసుమక్కయ్యగారు అమ్మతో గల అనుబంధాన్ని చక్కగా వివరించారు. పార్వతీపురం సోదరులు శ్రీ గంటేడ చిన్నంనాయుడు గారు పార్వతీపురం లో 2021 ఆగస్టు నుండి జరుగుతున్న నిత్యాన్న ప్రసాద వితరణలలో తమ అనుభవాలను తెలియజేశారు. విశాఖ, పార్వతీపురం, ఎస్. కోట, పాలకొండ తరపున శ్రీ వి. యస్. ఆర్. మూర్తిగారికి చిరుసత్కారంతో, శాంతిమంత్రంతో సభముగిసింది. “అమ్మ మందిరంలో “అమ్మ” అన్నప్రసాదాన్ని అందరూ స్వీకరించారు. *