విశాఖపట్నం అమ్మ మందిరంలో 17-2-2023 వ తేదీన నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా అమ్మ నాన్నగార్లకు ధాన్యాభిషేకం జరిగినది. ఆరోజు ఉదయం 10.30 గంటలకు D. S. N. రాజు శ్రీమతి లక్ష్మీ దంపతులచే గణపతిపూజ అర్కపురి ప్రధమపూజార్హిణి. హైమవతీదేవికి అష్టోత్తరశతనామావళితో పూజ చేసిన పిమ్మట, అమ్మ నాన్నగార్ల పాదపద్మములకు శ్రీలలితా. సహస్రనామ, త్రిశతి, ఖడ్గమాల, అంబికా అష్టోత్తరశతనామములు వాణి చదువు చుండగా మోటమర్రి వారి కుటుంబ సభ్యులచే సమర్పించిన బియ్యంతో వచ్చిన వారంతా అభిషేకం చేసుకున్నారు. వయోభారాన్ని లెక్కచేయకుండా కుసుమక్కయ్య గారు, డాక్టర్ అశ్వినీకుమార్ దంపతులు, వ్యాకరణం కామేశ్వరశర్మగారు, కుసుమక్కయ్య గారి కుటుంబ సభ్యులు, శ్రీ రామరాజు దంపతులు, మురళి, పార్వతి గారు పూర్వ విద్యార్థులు మరియు సుమారు 60 మంది అమ్మ బిడ్డలు పాల్గొన్నారు. వచ్చినవారికి అమ్మ ప్రసాదం పులిహోర రవ్వకేసరి ఇవ్వబడినది.
విశాఖలో నాన్నగారి ఆరాధనోత్సవం
Madyam Jaganadham
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.