విశాఖపట్టణం ‘అమ్మమందిరం’లో 17-09-2025న నాన్నగారి ఆరాధనోత్సవం కుసుమక్కయ్యగారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. శ్రీ లలితాసహస్రనామ, శ్రీసూక్త, నమక చమక వేదమంత్రపూర్వకంగా అర్చనచేసి, అదిదంతులు అమ్మ- నాన్నగార్లను బియ్యంతో అభిషేకించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కవిరాయని కామేశ్వరరావు, శ్రీ అన్నంరాజు సీతారామారావు, శ్రీమతి అనూరాధ, శ్రీ మురళి మున్నగువారు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. అనంతరం అందరూ అమ్మ ప్రసాదాన్ని స్వీకరించారు