విశాఖ అమ్మ మందిరంలో 18-11-2021న, ఆంగ్లకాలమానం ప్రకారము, హైమవతీదేవి 79వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మ మందిరాన్ని పార్వతిగారు, మురళి దంపతులు సుందరంగా అలంకరించారు.
ఉదయం గం. 10.30లకు శ్రీ హైమవతీవ్రతం ప్రారంభమై 1 గంటకు ముగిసింది. అనంతరం శ్రీ అంబికా అష్టోత్తర శతనామ, ఖడ్గమాలా పూర్వకంగా అర్చన జరిగింది.
ఈ వేడుకలలో శ్రీమతి కుసుమాచక్రవర్తి గారు, రామరాజు గారు, విజయవాడ. నుండి వచ్చిన మణిమాల గారు, రమ గారు, లక్ష్మి గారు ప్రభృతులు పాల్గొన్నారు.
అర్చనానంతరం 50 మంది సోదరీ సోదరులు అమ్మ – హైమమ్మల తీర్థప్రసాదాల్ని స్వీకరించి పులకరించారు.