విశ్వమంతా తన బిడ్డలుగా
బిడ్డలందరికీ విశ్వజననిగా
ప్రేమను పంచు, ప్రేమలో జీవించు
జీవుడు, దేహం, దేవుడు వేరుకాదు అని తలంచు
అంతా ఆంతర్యంలో ఒక్కటే అని భావించు
విశ్వమే దేవాలయం
జీవుడే దేవుడుగా తలచు
చెడ్డను నిర్మూలించుకోవాలి
చిరునవ్వుతో జీవించాలి
చదువుకునే వారిని చదివించాలి.
బిడ్డలందరి ఆకలి తీర్చే రోజే ఆనందం
లక్షమందికి ఒకేసారి అన్నదానం చేసిన ఆనందం
ఎన్నో అద్భుత మహిమలను చూపిస్తూ
ఎందరికో వరాలను అనుగ్రహిస్తూ
రోగులు, ఆర్తులు, నిరుపేదల వ్యాధులను నివారిస్తూ
ఆనంద, సంతోష, సహకారాలందిస్తూ
విద్య, ఆరోగ్య, వైద్య, సాంఘిక, ఆర్థికసహాయం చేస్తూ
సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ
జిల్లెళ్లమూడిని స్థిరవాసంగా చేసుకొని
బిడ్డలపాలిట అమ్మగా, విశ్వజననిగా
అందరి భక్తుల హృదయాలను ప్రేమగా
అందరికి మానవజీవిత అర్థాన్ని తెలిపే ప్రేమమూర్తిగా
అందరి హృదయాలలో మాతృత్వాన్ని, ప్రేమతో ఆదరణగా
విశ్వజనని అయిన “శ్రీజిల్లెళ్ళమూడి అమ్మ పాదపద్మాలకు
ఈ అక్షరనమస్కారములు మనఃపూర్వకంగా అర్పిస్తూ
అమ్మవిశ్వజననిగా, విశ్వజనని అయిన అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మగా
అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను
ప్రేమానురాగ సంబంధాలను
మాతృత్వ ఆశీర్వచన భావాలను
సేవా, త్యాగం, సౌభ్రాత్రం, ఆధ్యాత్మిక భావాలను
కలిగేలా ఆశీర్వదించాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ
సాష్టాంగదండప్రణామములు అర్పిస్తున్నాను.