మాతృప్రేమస్వరూపిణి, వాత్సల్యామృత వర్షిణి, జగన్మాత అమ్మ శతజయంతి ఉత్సవములకై ఉవ్వుళ్ళూరుతూ ఎదురుచూస్తున్న సోదరీ సోదర బృందానికి అభివందనాలు. ఎన్నాళ్ళుగానో వేచివున్న అపూర్వక్షణాలకి ఇక పద్దెనిమిది నెలలే సమయం వుంది. ఆ మహోదయ ఆవిష్కరణ శోభకృత్ నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి. ఆంగ్ల కాలెండరు ప్రకారం ఏప్రియల్ 1వ తేదీ 2023. ఆరోజు అశ్లేష నక్షత్రం కూడి వుండటం ఒక విశేషం.
అమ్మ బిడ్డలంతా కలిసి అమ్మకు ప్రేమతో జరుపుకుంటున్న పండుగ ఇది. “మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలన్నది” అమ్మ. మనలో అమ్మ చేతి గోరుముద్దలు తిన్నవాళ్ళున్నారు. అమ్మ సాన్నిధ్య, సాంగత్య భాగ్యం పొందిన వాళ్ళున్నారు. అమ్మ చేత నామకరణం, అక్షరాభ్యాసం జరిపించుకుని ఉన్నత విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులలో వున్న వాళ్ళున్నారు. ఇంకా ఎందరో, ఎందరో ఎన్నో అనుభవాల సంపద పొందిన వాళ్ళూ వున్నారు. “ప్రేమ నాకు సహజం నాన్నా! మీరు నాకేదో చెయ్యాలని నేనెప్పుడూ కోరుకోను” అన్నది అమ్మ.
“నా మీద ఎవరికి ప్రేమ ఉన్నా లేకపోయినా, నాకు మాత్రం అందరి మీదనూ, ఎల్లప్పుడూ ప్రేమ ఉండేటట్లు ఆశీర్వదించండి” అన్నది అమ్మ తన చిన్నతనంలోనే వాసుదాస స్వామిగారితో. చరిత్ర ఎరుగని అపూర్వ ప్రేమమూర్తి అమ్మ, త్యాగమూర్తి అమ్మ. ఎల్లలెరుగని, విశ్వజనీనమైన అటువంటి ప్రేమను ఏమని వివరించగలం? ఆ తల్లి ప్రేమకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
అమ్మ ఏర్పరచిన విశ్వకుటుంబంలోని మనమంతా ఈ మహోత్సవంలో ఆనందంగా, స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలి. అమ్మ ప్రీతికై మన నేవలని వినియోగిద్దాం. మనలో వివిధ రంగాలలో నిష్ణాతులై, అనుభవజ్ఞులై, లబ్ధప్రతిష్ఠులై, ఖ్యాతి గడించిన వ్యక్తులున్నారు. మన శక్తిసామర్ధ్యాలను అమ్మ సేవకై వినియోగించి మన జీవితాలను చరితార్థం చేసుకోగల అపూర్వ అవకాశం అసన్నమైంది. మీ సేవలని ఏ రూపంలో అందించగలరో నిర్ణయించే అధికారం మీదే. మీరే నిర్ణయించుకుని మాకు తెలపండి. ఉదాహరణకు మీరు ఇంజనీరైతే ఆ రంగంలో మీ సేవలు అందించవచ్చు. లేదా డాక్టరైతే ఆ రంగంలో – ఆర్థిక నిపుణులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి సంపాదించి వుండవచ్చు. ఏదీ కాకపోయినా, అతి సామాన్యులయినా సరే! అమ్మకు నేవ చేయాలనే కోరిక, సంకల్పం వుంటే చాలు.
మీ శక్తి సామర్ధ్యాలు మీకే తెలుసు. మీరేం చేయదలచుకున్నారో మాకు తెలిపితే, అమ్మ శతజయంత్యుత్సవ కమిటీ తుదినిర్ణయం తీసుకుని మీకు ఆహ్వానం అందిస్తుంది. మీ పేరు: అడ్రసు: వాట్సాప్ – ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐ.డి, ఏ రంగంలో సేవలందించగలరు, ఎంత సమయం జిల్లెళ్ళమూడిలో కేటాయించగలరు, ఎంతమంది రాగలరు:
పై ప్రశ్నలు ఉదాహరణకు మాత్రమే మీకు తోచిన ఇతర విషయాలు కూడా వ్రాయవచ్చు. మీ జవాబు ఈ మెయిల్ ద్వారా • గానీ, వాట్సాప్ ద్వారా గానీ, శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యాలయానికి ఉత్తరం ద్వారా గానీ తెలియజేయవచ్చు. ఈ-మెయిల్ మీకు తెలుసు resident secretary@viswajanani.org. secretary@viswajanani.org. WhatsApp No.94903 07364 (SVJP) or 9949064443 (Kamaraju) or 94916 15215 (Kamaraju)
మీ మీ స్పందన మాకు ఈ సంవత్సరం డిసెంబరు 31లోగా చేరితే, భవిష్యత్ కార్యాచరణ రూపొందించటంలో సహాయకారి కాగలదు.
ఇట్లు, అమ్మ సేవలో..
ఎమ్. దినకర్
అధ్యక్షులు,
శ్రీవిశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి
డి.వి.ఎన్. కామరాజు
ప్రధాన కార్యదర్శి,
శ్రీవిశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి