సభ 15-12-2019, ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో జరిగింది.
సభాధ్యక్షులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, అనంతరం ఆత్మీయ అతిథి – సినీనటుడు, కవి, రచయిత శ్రీ తనికెళ్ళ భరణిగారు, విశిష్ట అతిథులు మాజీ కేంద్రమంత్రి, న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి శ్రీ యస్.వేణుగోపాలాచారిగారు, ఎం.యల్.సి. గ్రేటర్ హైదరాబాదు బి.జె.పి. అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్రరావు గారు, ఇన్కమ్హక్స్ కమీషనర్ శ్రీవై.వి.యస్.టి.శాయి ఐ.ఆర్.యస్. గారు, ముఖ్యఅతిథి : టి.టి.డి.బోర్డు అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గారు వేదికను అలంకరించారు.
శ్రీ పి.గిరిధరకుమార్, వైస్ ప్రెసిడెంట్ హెచ్.డి. ఎఫ్.సి.బ్యాంక్ కళాకారులను సభకు పరిచయం చేశారు.
గాయకులు శ్రీ కారుణ్యగారు, శ్రీ కౌశిక్ గారు,శ్రీమతి నిత్యసంతోషిణి గారు ఈ ఆడియోలో వారు పాడిన కొన్ని పాటల కొన్ని చరణాలను మధురంగా, కర్ణపేయంగా ఆలపించి శ్రోతలను మైమరపించారు.
శ్రీ భరణిగారు మాట్లాడుతూ సహకారం వాద్యసహకారం, చక్కని స్వరరచన అందించారని, సాహిత్యం ఎంతో బాగున్నదని వ్యాఖ్యానించారు. శ్రీ శాయిగారు, శ్రీరామచంద్రరావుగారు, శ్రీ యస్.వేణుగోపాలాచారి గారు గేయాల సంగీత, సాహిత్య గానాన్ని ప్రశంసించారు. సుబ్బారెడ్డి గారు టి.టి.డి. బోర్డు చక్కని కార్యక్రమాలను, ధర్మప్రచారాన్ని నిర్వహిస్తున్నదనీ, ఆ భక్తి ధర్మ ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఆవిష్కరించిన పాటలు సహితం ఉంటాయని చెప్పారు. పెద్దలందరూ రచయిత శ్రీ వఝ హేమకుమార్ రచనల్ని, కృషిని ప్రశంసించారు.
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు అధ్యక్షులుగా తమ అద్భుతమయిన, చాతుర్యమయిన పద ప్రయోగ వాక్త్రవాహంతో సభికులను ఆనందపరుస్తూ ఎంతో హుందాగా సభను నడిపించారు.
ఆడియో సి.డి. పెన్ డ్రైవుల ఆవిష్కరణ అనంతరం సభా నిర్వాహకులు, వేదిక మీద పెద్దలను సన్మానించి, సి.డి.ని. పెన్ డ్రైవ్ను, శ్రీ వేంకటేశ్వరుని లడ్డు, గారె ప్రసాదాలను ఇచ్చారు.