- ఊరికి న్యాయాధికారి
అమ్మా నాన్నల కుపకారి
అర్కపురిని అడుగుపెట్టి
స్థానమ్మిచ్చిన రాముడు
- శారీరక లోపమున్న
సరకుగొనక సేవించెను
అమ్మవరముతో జీవిక
సాగించును లక్షణముగ
- ఉపాహారశాల నొకటి
అర్కపురిని ఏర్పరచి
ప్రధమ నివేదన అమ్మకు
సత్యముగా అందించెను
- సాగర రాజ్యమునందు
ప్రభవించిన వెన్నెలామె
అమ్మానుగ్రహ మందిన
ఆధ్యాత్మిక వైద్యురాలు
- అమ్మ మహత్తెరుగకునున్న
మంగళ గీతిక పాడుచు
సన్నాయినొక్కులు నొక్కచు
సంకటమున వెనకాయెను
- పొగబండో బ్రతుకుబండొ
అమ్మ తోడ ప్రయాణమ్ము
ఆపద కడతేరి శాంత
జీవనమును సాగించెను.