- అందరింటి పోషణకై
బిచ్చ మెత్తు మహాలక్ష్మి
ఉన్నచోట అమ్మను గను
తాపసి ఆ వీరవనిత
- గరికపాటి చేయనట్టి
గరిత అమ్మ సేవ చేసె
శిష్టుల దాక్షిణ్యముతో
అన్నపూర్ణయై వెలగెను
- సత్తాగల కలంవాడు.
ఉత్తముడౌ ధ్యానయోగి
తిరుమలేశు నామముతో
అమ్మ సేవ నిలిచినాడు
- భృగు మహర్షి ఫలకమెక్కి
తిరుమలగిరి వాసుడనుచు
నారాయణ స్మరణతోడ
అమ్మను సేవించినది
- కదలలేని తనకొరకై
సేవ చేయ వచ్చినట్టి
శ్రీ రాముడె అమ్మ అనెడి
గుండెలు తీసిన బంటు
- అమ్మ చేత కళ్యాణము
తొలిగా నందిన వనిత
ఆ ప్రభావమ్ముతోడ
రాజ్యమేలినట్టి ఘనత