- అమ్మచారిణిగ నిలచెను
ప్రజాసేవనే వలచెను
ఆరోగ్యము చేకూర్చెడి
సూర్యపుత్రి యా మగువ
- రాజగోప బాలునకు
రమ్యమైన భక్తురాలు
అమ్మ సేవలో కదిలె
రాజకీయముల రాటుతేలె
- మొసలి కన్నీరెన్నడు
కార్చని మొనగాడాతడు
మన పాలిటి ఉషస్సతడు
సిరి కొండగ నిలచినాడు.
- ఉత్తర విశిష్ట శాఖలొ
ఉన్నత ఉద్యోగి యతడు
ప్రజా ప్రశ్నలకు బదులిడు
మాతృశ్రీ ప్రసాదము
- అమ్మ ఎత్తి పెంచు పాప
విద్యలలో విశారద
సంసారపు కడలిలోన
సాగిన సంగీత నావ
- జగన్నాటకమున నిల్చి
నాటక మాడినవాడు.
చదువుల గుడిలో శ్రీమత్
నవభూషణమై నిలచెను