- కడగొట్టు బిడ్డడగుచు
కన్నతల్లి ప్రేమ నందె
ఈఈ పొగడగిట్టని
గోపాలుర రాజాతడు
- జీవితమున ఉషోదయం
అమ్మను చూచిన తదుపరె
విశ్వజనని దిగ్గజమును
వదలని మకరపు చూపే
- వాసు దాసు మార్గములో
వదలని ఒక బ్రహ్మమ్మే
అమ్మ సేవ చేయుటకై
ఇరువురు బిడ్డల నిచ్చెను.
- గడ్డి కొరకు వచ్చి అమృతపు
గడ్డనె లంకించు కొనియె
భగవతినే తనయింటికి
రప్పించిన ఫుల్లయశుడు
- ఎదలో ఒక విశిష్టమౌ
అమ్మాలయమును కట్టి
బంగారపు పుష్పముతో
పూజించే అయ్యగారు
- అమ్మ పట్ల యశోదయే
యాదవుకులమణిధారిణై
అమ్మ మెతుకు కొరకనెంచ
వారించిన సేవామణి