- కరుణశ్రీ అమ్మ చేత
కళ్యాణము నందుకొన్న
తరుణశ్రీ అరుణశ్రీ
అందరింటి బంధుశ్రీ
- తిరుపతి వేంకటరమణుని
భోగమ్ముల ననుభవించి
కమ్మని కస్తూరి చిమ్మ
అమ్మ సేవ గుబాళించె
- అమ్మ కంటి వైద్యుడైన
ఆంజనేయు డాతండు
పుత్తడి రీతిన కానిచో
సత్తు పాటి చేయబోడ ?
- విజయచిత్రశాలలోన
కింకరుడై శంకరుడై
వంకలు లంకలు దాటి
అమ్మ సేవ శార్మికుడయె
- పాల కొల్లగొట్టినట్టి
గోపాలుడు కాకున్నా
అమ్మ పాలబడినట్టి
గోపీమధు హృదయుండె
- రుద్రవరం పొంది పొంది
వాసుదేవుడై నిలచెను
గోపాలుని మామ యగుచు
అమ్మ సేవ చేయించెను