- శ్రీమన్ నవబాలకృష్ణు
బిడ్డగనే అమ్మ చేరి
సాయినాథు డోమంగని
ఋషినాథుని చెట్టబట్టే
- సత్యముగా అందరింటి
సాహచర్య మబ్బిననూ
స్థిరతలేక తిరిగె తిరిగి
అందరిల్లే దిక్కయ్యెను
- అమ్మగుండ వరం పొంది
నాగేశ్వరస్వామి యొక్క
ప్రేమను పొందినవాడు
వల్లూరుకు అల్లుడతడు
- సత్యజ్ఞాన సమాజపు
భావమ్ములు పెంచెనయ్య
అమ్మ చెంత తత్వ చింత
కావించిన వరాలయ్య
- పరసాయము నెరుగనట్టి
వనదుర్గా ప్రసాదమ్ము
అమ్మ ప్రేమ నందుకొన్న
మైథిలీ మనోహరుడు
- బ్రహ్మచారి కాదు కాదు
అమ్మచారి కాగల్గెను
అమ్మసేవ దత్తముగా
సాహిత్యము సృష్టించెను