- అమ్మ నగల మెరుగులకు
పనివీరుండౌ స్వామి
కళాకారుడై జగత్
కళ్యాణిని సేవించెను
- అమ్మ సేవ కస్తూరీ
పరిమళములనద్దినది
శారద గౌరీపతులకు
పేరు తెచ్చి పెరిగినది
- అమ్మ పాటె గాంగ ఝరిగ
రాజు పాటలెన్నో పాడె
సంకట మెరుగని వేంకట
ఈశ్వరుడై సంచరించే
- పద్యవిద్యనెఱిగినట్టి
గురునాధుండాతండు,
మిన్నయైన కన్నుతోడ,
అమ్మ చరిత వ్రాసినాడు.
- అంజనమున అమ్మ చూచి
హైమ్మమ్కకు భక్తుడయ్యె
ఆత్రేయుండై అమ్మలొ
షిరిడీ విభుకాంచినాడు.
- లంకలోని శివభక్తుడు
రామకృష్ణుడై నిలిచెను
మాతృశ్రీ వజోత్సవ
అధ్యక్షుండై వెలిగెను