- కరణాలందరిలోన
భూరి పేరు గల రాజు
భాగ్యవతీ పతిదేవుడు
బంధు గోపసింధువతడు
- తిమ్మాపుర వీధి నుండి
అమ్మ కడకు నడచి వచ్చి
జిడ్డు ప్రసాదము నందిన
అపర శంకరుం డాతడు.
- అరుణారుణ రోచిస్సుల
అందగించు ప్రసాదుడు
శివరాముని చిన్నవాడు
అమ్మ చేతి కళ్యాణుడు
- వ్రేపల్లెకు దరిరావుల
సింహపు బృందావనమున
అమ్మను అర్చించినట్టి
సత్యముత్య రాఘవము
- ఆకిరి పోకిరికాడు
దూరదర్శనమ్ము లోన
అమ్మను చూపించినట్టి
రాముండో కృష్ణుండో
- స్నేహమ్మది కలిసిరా
వినూత్న లక్ష్మి అందినది
గీతమ్ముల, న్యాయమెంచు
రామచంద్రుడై నిలచెను