- సింహద్వారపు పనిలో
అహరహమును సేవించియు
సన్యాసి జీవించియు
అమ్మానుగ్రహము పొందె
- శ్రీశైలపు శిఖరము వలె
అమ్మ ముఖము చూచినంత
మంగళవాద్యమ్ము నిచ్చి
చెరుకూరించెడి ఘనుడు.
- చంద్రమౌళి చిరంజీవి
పద్యరచనలో వాణి
అమ్మలోని చిదంబరత
యెరిగెనులే చివరికెపుడో
- శిష్టుం విశిష్టుండో
కనుల పచ్చదనము మాన్చు
పశువుల పసగల వైద్యుడు.
అమ్మ గురియొ అచంచలము
- ప్రతిరోజూ పండుగనుచు
ప్రతిభగ గ్రంధము వ్రాసె
ఘనరాజులు పాలించిన
పద్మముఖీ శేషార్థము
- తొలిరోజుల మాతృదర్శ
భోగమ్మందిన శ్రేష్ఠుడు
గుండిగ లందిచినట్టి
గుండె గలుగు మనీషి