- అమ్మే తన కూతురో
అమ్మకు తను కూతురో
నాన్నగారి కాత్మీయము
మాతృసుమ భ్రమరమ్ము
- రామనామయోగి యతడు
అమ్మ నామ సంకీర్తన
ఆనందముగా చేసెను
అమ్మ దాసుడై నిలచెను
- రాముడతడు కృష్ణుడతడు
ఎంత సహనమెంత ఓర్పు
అన్నపూర్ణ అమ్మ సేవ
చేసిన పూర్ణానందుడు
- పూజా పుష్పమ్ము దాచె
ముప్పదేళ్ళు భరణిలోన
దారిద్య్రపు పిచ్చిమూర్తి
అమ్మను వదలని స్ఫూర్తి.
- జగద్గురుని పీఠమ్మున
కెక్కిన శ్రీ ఆచార్యుడు
ఎన్నిమెట్ల నెక్కి రా
లచ్చిని చేపట్టినాడొ
- తొలి అభిషేకము అమ్మకు
సలుపు అదృష్టము కలిగె
ఆశేషజన మాదరించు
విశేషమ్మౌ స్థానము