1. అనసూయాదేవి అవతారం
వాత్సల్య రూపిణీం వందేహం జననీమ్
విద్యాధారిణీం జ్ఞాన ప్రదాయినీమ్
హే సృష్టికారిణి! శాంభవి మోహిని!
సద్గుణమండిత నారీశిరోమణి!
శాస్త్రార్థబోధిని! సదానందకారిణి!
వందేహం భవదీయ విజ్ఞానమూర్తిం!!
హే జగదంబే! జగదేక జనయిత్రి!
జనగణ పూజిత నిత్యాన్న దాత్రి!
జయహోూ మాతేతి నామ్నా తోషిణి!
వందే హం భవదీయ మద్భుత మంత్రం
2. బాలాత్రిపురసుందరి అవతారం
హే జగజ్జనని ! ఓంకారరూపిణి!
అఖిలాండేశ్వరి! శ్రీ అనసూయే!!
బాలే ! హే దుర్గే ! త్రిపుర సుందరి !
పరిహర దుఃఖా నస్మాన్ పాలయ
స్వీకురు భగవతి ! నః కైంకర్యం
వితరతు విద్యాం ధనధాన్యాదీన్!!
యత్రాన్న యాగం చలతి దేవి!
తత్ర భవతి హి త్వద్దర్శనం చ
భవదీయ తత్వం నిరుపమానం తు
తవసాన్నిధ్యం కైవల్యదాయకమ్!!
3. గాయత్రీ అవతారం
మంత్రధారిణి ! మంత్రబోధిని!
మంత్రరూపిణి ! శ్రీ అనసూయే!!
శ్రీ గాయత్రి! అర్కపురీశ్వరి!
త్రిపురసుందరి! త్రిలోకవందిని!
హే! కరుణాపాంగే!
పాహి పరాత్పరి! శ్రీ నాగేశ్వరి!!
అనుదిన మర్చిత శక్తి స్వరూపిణి
కుంకుమ చందన ధూప విరాజితే
మల్లికాది కనకాంబర శోభిని
రత్న ఖచిత మణిద్వీప నివాసిని..!!
4. అన్నపూర్ణ అవతారం
అన్నపూర్ణే పూర్ణేందు వదనే
శ్రీ అనసూయే నిత్యాన్న దాయినే!!
క్షేత్ర స్వరూపిణి సస్య సంవర్థిని!
సకల భక్త జన క్షుద్బాధా ప్రశమని!
ధాన్య ప్రదాయిని ! జగదేక మాత:!
తవ చరణం మమ దుఃఖ వినాశకమ్!!
ప్రాణాపాన సమాన స్వరూపిణి!
వ్యానోదాన సమాశ్రిత జనని!
అనల రూపిణి !అమృత వర్షిణి!
తవ చరణం మమ ఆనంద దాయకమ్!!
5. లలితా దేవి అవతారం
శ్రీ అనసూయే ! లలితాంబికే !
శ్రీ చక్ర చారిణి! సింహాసనేశ్వరి!!
బ్రహ్మాండేశ్వర పూజిత చరణే
నాగేంద్రాసక్త సుందర వదనే
శ్రీ నాగేశ్వర ప్రేమ స్వరూపిణి
జయ జయ జయహే జగదేక మాత:!!
శ్రీ లలితా రుచి సుస్మిత నయనే
నవ రత్నాంచిత తేజో మకుటే
జగదుద్ధారిణి రాజ రాజేశ్వరి
శ్రీ పరాత్పరి మాం పాహి దేవి!!
6. లక్ష్మీ అవతారం
హిరణ్య వర్ణాం శ్రీ అనసూయాం
మనసా వచసా భజామ్యహం
నిత్య సౌభాగ్య సంతుష్టాం
శ్రీ అనసూయాం స్మరామ్యహం
సర్వ సంపద్వర్షక జననీం
కనక పుష్ప సంపూజిత చరణాం
సకల దారిద్ర్య మోచక జననీం
శ్రీ అనసూయాం స్మరామ్యహం!!
ధన ధాన్య లక్ష్మీం శ్రీ అనసూయాం
అనుదిన సంతాన వందిత దేవీం
ధన కనక వస్తు వాహన దాత్రీం
శ్రీ అనసూయాం భజామ్యహం!!
7. సరస్వతీ అవతారం
వందే సరస్వతీం దేవీం
జ్ఞాన ప్రదాత్రీం శ్రీ అనసూయామ్!!
ఆగమ వేదినీం శాస్త్ర వినోదినీం
శబ్దరూపిణీం సుప్రకాశినీం
వీణా పుస్తక ధారిణీం తాం
వందే రంగమాంబా సుతాం!!
శ్వేతాంబరధర శోభినీం
శ్రుత్యంతర్గత తత్త్వ బోధినీం
మేధా శ్రద్ధా జ్ఞాన వర్ధినీం
వందే హైమవతీ జనయిత్రీం!!
8. దుర్గావతారం
ధిమిత ధిమిత ధిమి
తకిట తకిట ధిమి అంబే జయదుర్గే!
ధీం ధీం తరికిట
తకయోం తరికిట దుర్గే అనసూయే!!
అంబే జయదుర్గే దుర్గే అనసూయే
ఆశ్రిత నృపాలకే…!!
దయాంతరంగే వాత్సల్య గంగే
బ్రహ్మాండ తేజస్స్నుషే…
కువలయ నేత్రే కోమల గాత్రే
కుంకుమ తిలకాంచితే..!!
దుష్ట నివారిణి శిష్ట సంవర్థని
మాత: అనసూయే!!
ధిమిత ధిమిత ధిమి
తకిట తకిట ధిమి అంటే అనసూయే
ధీం ధీం తరికిట
తకఝేమ్ తరికిట దుర్గే అనసూయే!!
మన్నవ వంశ విభూషిణి భగవతి
బ్రహ్మాండాన్వయ వ్యాపిని పావని
అధి వ్యాధి ప్రశమని జనని
దుర్గే అనసూయే..!!
హే జయ జయ దుర్గే హే జయ జగదంబే
అంబే అనసూయే…!!
9. మహిషాసురమర్దిని అవతారం
రుద్రాణి శివాని మహిషాసురమర్దిని
ఈశ్వరీ నాగేశ్వరీ అర్కపురాధీశ్వరి!
జయ జయ జయహే శ్రీ అనసూయే!
జయ జయ జయహే శ్రీ పరాత్పరి!!
దుష్టత్వ వారిణి! దారిద్య్ర నాశిని !
క్షుద్బాధ హన్రీ రాజరాజేశ్వరి
పాహి జగదీశ్వరీ శక్తి స్వరూపిణి!
మాం పాహి మాం పాహి కైవల్య దాయిని!
10. రాజరాజేశ్వరీ అవతారం
శంఖ చక్ర త్రిశూల ధారిణి!
శ్రీ నాగేశ్వరి! శాంకరి! శాంభవి!
సకల సౌభాగ్య భుక్తి ప్రదాయిని!
రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి!
పాహి మాం దేవి పరమ పావని!
పరమైశ్వర్య ప్రదాయక సాధ్వి!!
నిత్య నామ సంకీర్తన తోషిణి
నిర్వికార నిగమాగమ రూపిణి
నాట్య వినోదిని నాటక దర్శని
నవ నాగేశ్వర హృదయ విలాసిని
ఓం శాంతిః శాంతిః శాంతిః