పరులనని తెచ్చుకొనకుము బాధనెపుడు
పరులు అన్నారటంచును బాధపడకు
పరుల జోలేల నీకని పలుకు నమ్మ
వినుము చిన్నమ్మ మాటలు కనుము నిజమూ॥
మా నాన్నగారు నడింపల్లి వాసుదేవమూర్తిగారు స్వచ్ఛమైన మనస్సు, ప్రశాంతచిత్తులు, సరస్వతీ కంఠాభరణులు, వేదాంతి, యోగి, నిరాడంబరులు. మరి వారి యొక్క మొదటి గురువు చిన్నమ్మగారు. రేపల్లె తాలూకా పేటేరు ఆశ్రమంలో ఆమె నివసించారు. మా బోటివారికి ఒక ముద్ద పెట్టుకోండిరా చాలును అనేవారట. మా నాన్నగారంటే నాకు చాలా చాలా యిష్టం. అందుకే వారిని ఈ రోజు విశ్వజననికి పరిచయం చేయడంజరిగింది.
భౌతికంగా అమ్మ యొక్క దేవతామూర్తి ఆకారాన్ని దర్శించాము. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ దేవతామూర్తి చేతిని మరువక, ఆమె నామాన్ని చేయడం ఆపక, తలపులను త్రోసి వేయక మానవగృహానికి – దేవతా గృహానికి మధ్య వారధిని ఏర్పాటు చేసుకుని జీవన యానం సాగిస్తున్నాము. చెట్లకు పూలు, కాయలు, పండ్లు కాస్తున్నాయి. ఋతువులు వాటి ధర్మాలను అవి నేరవేరుస్తున్నాయి. వరుణుడి కృపాకటాక్షంతో పంటలు పండి, ఆనందాన్ని ఇస్తున్నాయి. సృష్టి కార్యక్రమం జరుగుతోంది. దీనికేమో కరెంట్ స్విచ్ లు లేవు. అన్ని రకాల జీవరాశులు భూమి మీద నివసిస్తున్నాయి. వీటికి అతి తెలివిరావడంతో ఉపద్రవాలు వస్తున్నాయి. మిగిలిన ప్రాణులు ఈ బాధలు తట్టుకోలేక తల్లడిల్లు తున్నాయి. భగవంతుడనే పదం ఉంది కనుక మహర్షుల తపోబలంతో వారిని భూమి మీదకు రప్పించడం జరిగింది వారు కనికరంతో జీవులను అక్కున చేర్చుకొని సేద తేర్చి బుద్ధిని మారుస్తున్నారు. ఆ జీవి మానసిక ఆనందమును అనుభవించి ఇంతకంటే మరొకటి అక్కరలేదు అని బల్లగుద్ది చెప్పాడు. అంతటితో ఆగని జీవి మరొకడు – తెలివిమీరవిపరీతపు చేష్టలతో ఆ శక్తిని ఎలాగైనా లోబరచుకోవాలనే ఆశతో చేయకూడని పనులు చేసి సృష్టిని అల్లకల్లోలానికి గురి చేస్తున్నాడు. ఈ తరుణంలోనే సత్పురుషుల ఆగమనం – జరగడం సంభవిస్తుంది. వారి సన్నిధి శుభదాయకం అని తెలుసు. అయినా వక్రమార్గానికే పోతున్నాడు. సైతాను పట్టి పీడిస్తోంది. నష్టమునకు పునాది తానే బాధ్యుడు అయ్యాడు. ఇది పంటమార్పిడి నష్టం కాదు. ఇది జిల్లా కలెక్టరు ఇచ్చే (ధనం) Remuneration కాదు. ఇటువంటి నష్టాన్ని ఆయన పూరించలేరు. ఇదొక ఉప్పెన. గురుడు దైవం- వాడు తలిస్తే అవుతుంది. మారాముళ్ళు వేశాడా 1000 అడుగుల లోతున్న గొయ్యి జ్ఞాపకం రావాల్సిందే. అమ్మే కదా – అవనియే ఆరాధ్య దైవం – తృప్తే ముక్తి – ఈ విధమైన మాటలు అవగాహనకు రాకుండా, ఊరికే ఆ మాటలు పట్టుకొంటే వాటిని కేవలం చిలక పలుకులుగా వల్లిస్తే బ్రతుకు గాడితప్పి కన్ను లొట్టబోయిన చందానఅవుతుంది. ఇది మాత్రం తథ్యము సుమతీ –
ఇది అమ్మవారి యొక్క అనుగ్రహభాషణం. వేదాలు అపౌరుషేయములని పెద్దలు చెప్పారు. ఈనాడు మనం చూస్తున్నది కూడ ఇదే. ఇక్కడ జరిగింది అమ్మ యొక్క అమృతవర్షం. అమ్మవారి యొక్క వేదాలనే జలధార – అనుగ్రహ జలసంద్రం అంటే ముచ్చటగా వుంటుంది.వచ్చాం-పోయాం-గుండిగల్లో అన్నం ఎవరు తింటున్నారు -తింటే ఏం లాభం – తినకపోతే ఏం నష్టం అని -అని అనుకొన్నామా – మనస్సులోకి ఈలాంటివి చొరబడ్డాయా గోవిందో, గోవిందా గుట్టు కాస్త గోవిందా అనే పద్ధతిలో. కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అనే సంస్కారం మనల్ని పిప్పి చేసి – ముళ్ళ కంచెలోకి తోసి వేస్తుంది. సందేహమా ? ఓ శివకామేశ్వరీ – అర్ధనారీశ్వరీ – భువన మోహిని, అమరేశ్వరీ, అంతరంగ నిలయవాసినీ, సాక్షాత్ శ్రీమహావిష్ణువు పొన నీకు శతాధిక వందనాలు అర్పించుకొంటున్నాను. చెప్పవలసినదంతా చెప్పేశాను.ఓడిస్తావో – గెలిపిస్తావో – ఓటమి నే అంగీకరింపను మనస్సును – ఓడింప చేస్తావో, ఓడిపోయినా ఓటమినే గెలిపించేట్లుగా చేస్తావో – ఓడిపోయినా ఓటమేలేదనుభావనను దృఢం చేస్తావో ॥
సామాన్యులం అసామాన్యుల జోలికి వెళ్ళనే కూడదు. వెళ్ళామా వదలకూడదు-వదలకనే ఉన్నామా సంశయం రాకూడదు. సంశయించామా – సంశయాత్మా వినశ్యతి – ఇదేమీ సామాన్య వ్యవహారం కాదు. భర్త, బిడ్డలనే సంసారాన్ని విడువగలమా? ఒక వేళ వున్నా – గొప్పగా మన వ్యక్తిత్వమును మనిషి మనిషికి చెప్పుకోకుండా వుండగలమా ? ఒక వేళ వుందామని ప్రయత్నించినా మనస్సుకు రోగం రాకుండా వుండగలదా ? అప్పుడే వస్తుంది డాక్టర్ జస్వంత్ (ప్రముఖ మానసిక రోగవైద్య నిపుణులు)గారి యొక్క అవసరం
అందుకే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మహా మధ్యాటవీ నివాశిన్యై నమోనమ? అని స్తుతించారు అమ్మవారిని – అందరికీ నా దసరా శుభాకాంక్షలు. పూజలేమీ ఆగవు. వాటి part అవి చేసుకొని పోతాయి. గుండిగలు దిగుతాయి. గుడిగంటలు గణగణమని మ్రోగుతాయి. అమ్మ యొక్క సౌభాగ్య సదస్సులను నిర్వహించేట్లుగా చేస్తాయి. రాధన్నయ్య అనే వాడు -దేముడి పనులు ఏమీ ఆగవు. మనం అనుకొంటామే అవే ఆగుతా యని. కనుకఆలోచించండి.
దేవుడి గూట్లో దీపారాధన చేసి పూజకు ఉపక్రమించే సమయానికి, వాడు నాబిడ్డగా ఎవరికి పూజ చేస్తావని గద్దించినట్లుగా అయింది. “ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త” అనే నామాన్ని జపిస్తుంటే-వాడికి గోరుముద్దలు పెట్టింది నేను కదా అన్న వైఖరినీ ప్రదర్శించింది. నాన్నగారు, నాన్నగారు, ఓం నాన్నగారు, జిల్లెళ్ళమూడి కరణంగారైన ఓ పెద్ద పెద్ద అందరికీ నాన్నగారు – అని పిలుస్తుంటే – భలే బావుందేనే విధానం – ఆయన క్కూడా తల్లిని నేనేగా అంటూ చిరునవ్వు నవ్విందిఅమ్మ.