జిల్లెళ్ళమూడిలో అందరింట్లో కళ్యాణమండపం పైన 02-08-22 (గరుడ పంచమి) నుండి 06-08-22 వరకు ఐదు రోజులు SVJP Temples Trust సహకారంతో శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
సర్వాన్నీ, సర్వులనీ పవిత్రీకృతం చేసే జగన్మాతృ ఉత్సవాలు పవిత్రోత్సవాలు. ఉత్సవాల్లో అనుదినం అమ్మకు షోడశోపచార విధిని పూజ, మంగళహారతి, చిమ్మిరి పేరంటం, ప్రసాద వితరణ మున్నగు కార్యక్రమాలను దీక్షగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో శ్రీ నరసింహారావు మామయ్య, శ్రీ మొవ్వ కృష్ణప్రసాద్, శ్రీ బుద్ధిమంతుడు, వఝప్రసాదరావు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ మున్నగు అనేక సోదరీసోదరులు సహకరించారు. 12-08-22 (11 వ రోజున) శ్రీమతి బోళ్ళ వరలక్ష్మి అక్కయ్య శాస్త్రోక్తంగా అరిసెలు మున్నగు పిండివంటలతో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు.
‘విశ్వజనని’ ‘అమ్మ’ శుభాశీస్సులు సర్వులపై సదా వర్షించుగాక!!