- ఓంకారనందగిరి స్వామి
శతజయంతి ఉత్సవం అది యెంతో సంబరం
మాతృశ్రీ విశ్వజనని అనసూయకు వందనం
IIశతజయంతిII
చైత్రశుద్ధ ఏకాదశి ఆశ్లేషాతారలో
జన్మించెను కన్నతల్లి నూరేళ్ళకు ముందరా
IIశతజయంతిII
అందరింటి సీమలోన వెల్లివిరిసె సంతసం
పుడమితల్లి పులకించెను పుట్టిన అమ్మను చూచీ
IIశతజయంతిII
విశ్వములో ప్రేమనెపుడు నారుపోసి పెంచగా
జనియించెను ఆదిజనని అనసూయగ భూమిపై
IIశతజయంతిII
సూర్యోదయ సమయమిదీ సర్వజీవజాతులకు
తమోఘ్నమై పాపహరము
ప్రేమామృత దాయకం
ఆకలి ఒకటే అర్హత అమ్మ ప్రేమ పొందగా
కులగుణ భేదములు లేవూ కన్నతల్లి కరుణకూ
రండి రండి అర్కపురికి ఆశీస్సులు పొందగా
విశ్వజనని శ్రీమాతా శ్రీమత్సింహాసనేశ్వరి
IIశతజయంతిII