శత జయంతి ఉత్సవమ్
జగతికి బ్రహె్మూత్సవమ్
శత శతముల జనావళికి
అన్నయాగ మహోత్సవం
మన కోసమే తనరాకని
అందరమ్మగా కొలువై
బిడ్డల ఆకలి తీర్చెను
బ్రహ్మాండము నేలు తల్లి
అమ్మ మనసు తరచి చూడ
సురులకైన సాధ్యమా
అవనిలోన అమ్మంటే
అమృతమె పరికింపగా
అమృతమౌ అమ్మకు
జరుగు జన్మ దినోత్సవం!!
అఖిలాండము పరవశించు
అద్భుతమౌ మహోత్సవం!!
విశ్వజనని ఈ తల్లి
విశ్వము తానైన తల్లి
సకల చరాచరములను
చల్లగా చూచు తల్లి
అమ్మ మహిమ అనంతము అనుభవైక వేద్యము
అమ్మ ప్రేమ మకరందము గ్రోలుటయే మార్గము
మధురమౌ ప్రేమకు
జరుగు జన్మ దినోత్సవం
జిల్లెళ్ళమూడి అమ్మకు
శత జయంతి ఉత్సవమ్…!!