1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శతజయంతి శంఖారావం – (ప్రముఖుల సందేశాలు)

శతజయంతి శంఖారావం – (ప్రముఖుల సందేశాలు)

Various Authors
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

నాల్గవరోజు (31.3.2023)

“జిల్లెళ్ళమూడి నాకు నైమిశారణ్యంను తలపించింది. సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పిన పురాణ గాథలు ఒకవైపు, వేద పారాయణలు ఇంకొకవైపు, భోజన వసతి మరోవైపు. అమ్మ ఏది జరగాలో అదే జరుపుతుంది. జరగకూడనిది జరపదు. ఇది గట్టిగా పట్టుకుంటే, వేదాంతమంతా ఈ పాయింట్ లోనే ఉంది.”

శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు,

విజయరాజరాజేశ్వరి పీఠం, పెదపులిపాక

“ప్రత్యక్షంగా శతజయంత్యుత్సవ సందేశ సభకు రాలేక, ఆశీస్సులు అమ్మ బిడ్డలందరికి అందచేస్తున్నాను.”

శ్రీ శ్రీ శ్రీ స్వామి సీతారామ్ గురుదేవులు,

ముముక్షుజన పీఠం, పెద ముత్తేవి

“అందరూ ఒకటే అన్న భావనతో మతాలకి కులాలకి అతీతంగా అమ్మ తన అందరిల్లు స్థాపించారు. దాన్నే భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అమ్మ ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్న మీరందరూ ధన్యజీవులు. వేరే ఆస్తిపాస్తులు కూడా అక్కర్లేదు, అమ్మ ఆశీర్వాదమే మీకు పెద్ద ఆస్తి అని నేను భావిస్తూ ఉన్నాను.”

శ్రీమతి పనబాక లక్ష్మిగారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు

“ఈ సభలు విజయవంతంగా జరగాలనీ అన్ని కార్యక్రమాలూ వైభవోపేతంగా జరగాలనీ నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.”

శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు,

మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, ఛైర్మన్ , సంగం డెయిరీ.

“అమ్మ కు అంజలి ఘటిస్తూ, అమ్మ బిడ్డలకు నా సంపూర్ణ సహకారాలుంటాయని తెలియచేస్తున్నాను.”

శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మగారు,

ఛైర్మన్, వేగేశ్న ట్రస్టు, బాపట్ల

“మనందరికీ అమ్మ ఇచ్చిన శక్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కోరిక కలగాలంటే అమ్మ ఆశీస్సులు ఉండాలి. దాన్ని సాధించాలంటే జ్ఞానం కావాలి . క్రియా రూపంలో పొందాలంటే దాన్ని నిర్వహించాలి. మరలా అమ్మే శక్తినివ్వాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అమ్మ ప్రసాదించవలసినదే. ఈ ప్రాంతానికి చెంది ఇక్కడ గాలి పీల్చుకున్న వారు, నీరు తాగిన వారు, మెతుకు తిన్నవారు అందరూ వైభవం పొందారు. ఈ వైభవం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది”.

శ్రీ మా శర్మ గారు, వ్యవస్థాపకులు, శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం.

– శ్రీ కొండముది సుబ్బారావుగారి సౌజన్యంతో

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!