1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శతజయంతి శంఖారావం – (ప్రముఖుల సందేశాలు)

శతజయంతి శంఖారావం – (ప్రముఖుల సందేశాలు)

Various Authors
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : June
Issue Number : 11
Year : 2022

మొదటి రోజు (28.3.2023.)

“నేను ఐ.ఏ.యస్.లో ఉత్తీర్ణత పొందటానికి, నా ‘ఉద్యోగ విధులను సార్థకంగా నిర్వహించటానికి అమ్మ అనుగ్రహమే మూల కారణం.”

– శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి.

“మా గురువర్యులు శ్రీ సద్గురు శివానందమూర్తిగారి ద్వారా మొట్టమొదటి సారి అమ్మను గురించి తెలుసుకున్నాను.

సృష్టి స్థితి లయాలకు మూలకారణమైన కాళికా దేవి అవతారమే అమ్మ అని మా గురువుగారు వివరించారు. అమ్మ అందించే అన్నప్రసాదం మన జన్మ జన్మల కర్మ క్షయం చేస్తుంది.”

– శ్రీ గెంటేల వెంకట రమణగారు, రమణ కేంద్రం, బలుసుపాడు.

అమ్మ సంస్థలు, అమ్మ ప్రేమతత్త్వం జగద్వ్యాప్తం కావటానికి మనమంతా మరింతగా కృషిచేసి అమ్మ తీర్చుకునే ప్రయత్నం చేయాలి.

– శ్రీ ఎం.వి.ఆర్.శర్మగారు. సంపాదకులు, “దర్శనం” మాస పత్రిక.

“బాల్యంలోనే అమ్మను గురించి తెలుసుకోవటం, అమ్మ ప్రేమను అందుకోవటం నా అదృష్టం. ఉన్నతికీ మా సంస్థల అభ్యుదయానికీ అమ్మ అనుగ్రహమే కారణం”.

  • డా.పి.అనూరాధగారు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకతీయ సిమెంట్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

“అమ్మ మహిమలు అనంతం. లోక కల్యాణమే అమ్మ అవతార లక్ష్యం.”

– శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీస్వామిని వారు, శ్రీ శక్తిపీఠాధీశ్వరి.

“అమ్మ కు సాటి అమ్మే”

– శ్రీశ్రీశ్రీ నృసింహానంద భారతీస్వామివారు. కుర్తాళంపీఠ యతివర్యులు.

“అమ్మ శతజయంతి మహోత్సవాలలో పాల్గొనటం అదృష్టం. అమ్మ సన్నిధిలో అందరమూ బిడ్డలమే. అర్కపురి ఒక దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంతో, అమ్మతో ఏడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆత్మీయ బంధం అనిర్వచనీయం. మహాకవి తిక్కన సోమయాజి ఈ క్షేత్రంలో యజ్ఞం చేశారు. అవతారమూర్తి అయిన అమ్మ వల్లనే జిల్లెళ్ళమూడి విశ్వ వ్యాప్తం అయింది. “

  • శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు. పీఠాధిపతి, శ్రీ సిద్ధేశ్వరీపీఠం, కుర్తాళం.

శ్రీ డి.వి.ఎన్.కామరాజుగారి సౌజన్యంతో….

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!