1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శివానందరూపః శివోహం శివోహం

శివానందరూపః శివోహం శివోహం

Omkaranamda Giri Svami, K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : December
Issue Number : 5
Year : 2014

నేను T.T.D. వారి ఛానల్ను వీక్షిస్తున్నాను. అప్పుడు నిత్య పూజా విధానాలు ప్రోగ్రామ్ వస్తున్నది. అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది స్వామి వారికి చేసే సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవదాకా నిత్య సేవలు స్వామివారికి జరుగుతున్నవా లేక వారి విగ్రహాలకు జరుగుతున్నవా? స్వామివారు సర్వవ్యాపి, సర్వాంతర్యామి కనుక ఒక రూపం అనేది ఉండదు. సకలోపచారాలతో స్వామిని ఆరాధించాలంటే ఒక రూపం కావాలి. కనుక విగ్రహం అవసరమైనది. “విగ్రహం నిగ్రహం కొరకే” అన్నది అమ్మ. రూపం వుంటేనే ఉపచారాలు చెయ్యగలము. కనుక విగ్రహాన్నే స్వామిగా భావించి ఉపచారాలు చేస్తున్నాము. కనుక స్వామి భావనా మాత్రంగానే వున్నాడు. “భావనామాత్ర సంతుష్టాయ” అని అన్నారు కనుక భావనామాత్రం చేత స్వామి సంతుష్టుడౌతాడు అని తెలుస్తుంది. మరి ఆ భావం ఎక్కడినుండి వస్తుంది. ఆ భావం ఎక్కడనుండో రావడం లేదు ఆ భావం తనదే. అనగా ఆ భావానికి మూలం తనే. ఈ సకలోపచారాలు ఎవరికి చేస్తున్నాడు – స్వామికి అనే అనాలి. స్వామి ఎక్కడున్నాడు? స్వామి తన భావంలోనే. కనుక తన భావమే తనే ఆ స్వామి. ఆ స్వామిని చూడటానికి ఎక్కడికో పోనవసరం లేదు. కారణం ఎక్కడికి పోయినా ఆ స్వామిని చూడవలసిందీ తానే. చూస్తున్నది తానే, చూచేది తననే. కనుక ఎక్కడికి పోయినా తన్ను తాను చూచుకోవడానికే వెళ్తున్నాడు. అదే లోచూపు. లోచూపు అంటే – అంతా అంతటా తననే చూచుకోవటం తనే చూచుకోవటం అన్న మాట. అమ్మ అన్నది “లడ్డు కావటం కంటే లడ్డు రుచి చూడటంలోనే ఆనందం వున్నది. కనుక ఆయనను స్వామిగా మనం భక్తులుగా భావం పొంది సకలోపచారాలు చేసి ఆనందిస్తున్నాము. ఆ సకలోపచారాలు చేసేది ఎవరికో కాదు మనకు మనమే చేసుకుంటున్నాము. చూసుకుంటు న్నాము. చేసిది చూసేది తనే అనగా “నేనే” అదే శివోహం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!