హైదరాబాద్లో 26-6-2022 న ఉభయట్రస్టుల అధ్యక్షులు శ్రీ కె.నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ‘అమ్మ శతజయంతి ఉత్సవ నిర్వహణ’ సమావేశంలో తగు సూచనలు అందినవి.
దరిమలా 9-7-22 న జరిగిన ఉభయట్రస్టుల అంతర్జాల సమావేశంలో వాటిని యథాతథంగా ఆమోదించారు. ప్రధానంగా 10 ముఖ్య విభాగాలను గుర్తించి 10 క్రియాశీలక కమిటీలను నియమించారు. ఒక్కొక్క కమిటీలో గౌరవ సలహాదారులు, కార్యదర్శి, Ex-officio సభ్యులు, సభ్యులు ఉంటారు.
కనుక ఆయా కమిటీలు అమ్మ శుభాశీస్సులతో తమ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుని కార్యరంగలోకి ప్రవేశిస్తారు. సోదరీసోదరుల సౌలభ్యం కోసం ఆయా కమిటీలు, కార్యదర్శుల వివరములను ఇందు పొందుపరుస్తున్నాము.
- సర్వోన్నత కమిటి (విధాన నిర్ణయాలను చేస్తూ ఆయా కమిటీలకు దిశా నిర్దేశం చేయుట) అధ్యక్షులు : శ్రీ కె.నరసింహమూర్తి
- అమ్మ సందేశ ప్రచార కమిటి (సదస్సులు, సెమినార్ల నిర్వహణ మున్నగునవి)
కార్యదర్శి : శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
- ఆర్థిక మరియు బడ్జెట్ కమిటి (ఆదాయ వ్యయముల సమీక్ష, ఆడిట్) కార్యదర్శి : శ్రీ పి.ప్రేమ్ గోపాల్
- ప్రసార మాధ్యమం కమిటీ (ప్రచారము, ప్రసార మాధ్యమాలు) కార్యదర్శి : శ్రీ ఈమని కృష్ణ
- నిధుల సమీకరణ; కార్యదర్శి : శ్రీ వి.యస్.ఆర్.ప్రసాదరావు
- సావనీర్ కమిటీ (వివిధ భాషలలో గ్రంథాల ప్రచురణ, సావనీర్)
కార్యదర్శి : శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
- సమాదరణ వసతి పరికల్పన కమిటీ (వసతి గృహాలు, తాత్కాలిక డార్మిటరీ, స్వచ్ఛంద కార్యకర్తల సమీకరణ) కార్యదర్శి : శ్రీ యల్.సత్యనారాయణ
- ఆహారము – ఏర్పాటు కమిటీ (వంటశాల, వడ్డన, పంపిణీ) కార్యదర్శి : శ్రీమతి వి.అరుణ
- I.T.కమిటీ : (Website, Apps design) కార్యదర్శి : శ్రీ వి. హేమకుమార్
- పథకముల కమిటీ (భవనాల నిర్మాణము, మరమ్మత్తులు, అమ్మ మ్యూజియం మున్నగునవి)
కార్యదర్శి : శ్రీ భట్టిప్రోలు రామచంద్ర
అమ్మయందలి భక్తి తాత్పర్యములతో ఆయా కమిటీలలో స్వచ్ఛందంగా తమ సహాయ సహకారముల నందింప ఆసక్తిగలవారు ఆయా కమిటీ కార్యదర్శులను సంప్రదించగలరు.
– S.V.J.P. Trust, Jillellamudi