1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శృంగార లహరి

శృంగార లహరి

Pannala Radhakrishna Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

(1) యయా శక్త్యా బ్రహ్మా కమలనయనః ఫాలనయనః

జగత్ స్రష్టుం పాతుం ప్రళయ ముపనేతుం చ కుశలాః !

యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం

నమా మ్యాద్యాం దేవీం ముకుళిత కర స్తా మభయదామ్ ॥

తా॥ ఏ శక్తి చేత బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు విశ్వముయొక్క సృష్టిస్థితిలయములను జేయ నిపుణులైరో, ఏ శక్తి చేత విశ్వము వ్యాప్తమై యున్నదో, దేని యందు ఈ విశ్వ మంతయు ఉన్నదో అభయ ప్రదాయినియు, దేవీస్వరూపిణియునగు ఆ ఆదిశక్తికి కరములను మోడ్చి నమస్కరించుచున్నాను.

(2) పదాభ్యాం శ్రీమాతుః సురగణ పదాభ్యాం పరసుఖా

స్పదాభ్యాం రేఖాంచ ద్బహు శుభ పదాభ్యాంచ సతతంI

వరాభ్యాం ధన్యేషు ప్రణిహిత వరాభ్యాం త్రిజగతీ

ధరాభ్యాం తాపాగ్నేః నవ జలధరాభ్యాం నతిరియమ్ ॥

తా॥ దేవతా సమూహమునకు శరణ్యమైనవియు, బ్రహ్మానంద మొసగు నవియు, రేఖలచే నొప్పు అనేక శుభచిహ్నములు గలవియు, శ్రేష్ఠము లైనవియు, ధన్యులకు వరముల నొసగునవియు, త్రిలోకములను ధరించునవియు, సంతాపమనెడి అగ్నికి నూతన మేఘములై నవియు నగు శ్రీమాతయొక్క చరణములకు నిరంతరము ఈ నమస్కారము అర్పింపబడుచున్నది.

(సశేషం)

బాలాత్రిపురసుందరి

“బాలాత్రిపురసుందరి అంటే బాల అంటే పుటక, త్రిపురసుందరి అంటే కౌమారస్థితులు కలిగినటువంటిది. బాలాత్రిపురసుందరి అంటే – సృష్టి స్థితి లయాలు, భూత భవిష్యత్ వర్తమానాలు, సర్వమూ ఆమె రూపమే. ఆమె అంటే చేతులూ, కాళ్ళూ, చీర, రవిక కలిగిన ఆమె కాదు. శక్తి. అంటే ప్రతీదానిలో గర్భితమయిన శక్తి. ఆ శక్తియే ఆమె.” అమ్మ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!